ఈ ఫొటో పెట్టి బాలయ్యను బాగా ఆడుకుంటున్నారు

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. రేపు రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి భాగం గా విడుదల కానున్న ఈ సినిమా హడావిడిలో బాలయ్య , ఆయన ఫ్యాన్స్ ఉన్నారు.

అయితే ఆయన యాంటీ ఫ్యాన్స్ ..ఆ సినిమాని ఎలా వెటకారం చేయాలనే పనిలో ఉన్నారు. అందుకు వారు ఈ సినిమా విడుదల చేసిన బాలయ్య స్టిల్ ని ఎంచుకున్నారు. ఈ స్టిల్ లో బాలయ్య .. బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం ముఖ్యమంత్రి మాయావతి మాయావతిని గుర్తు చేస్తున్నారంటూ…పోస్ట్ లు పెడుతున్నారు. అంతేకాకుండా మాయావతి పాత్ర ఈ సినిమాలో ఉందని, దాన్ని బాలయ్యే పోషించాడంటూ హల్ చల్ చేస్తున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే.. క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ తో బయటకు వచ్చిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో సెన్సార్ బోర్డ్ ఎటువంటి అభ్యంతరాలు చెప్పలేదు. ఈ సినిమా రన్ టైం 170 నిమిషాలని సమాచారం. బాలీవుడ్ భామ విద్యాబాలన్ ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

రానా దగ్గుబాటి, నిత్యామీనన్, రకుల్ ప్రీత్, సుమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా జనవరి 9 వ తారీకున విడుదలకు సిద్ధంగా ఉంది. నందమూరి బాలకృష్ణ సినిమా స్వయంగా నిర్మించారు. ఇప్పటికే చిత్ర ట్రైలర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.