నటుడు, రాజకీయనాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యన్‌టిఆర్’. తండ్రి ఎన్టీఆర్ పాత్రలో తనయుడు బాలకృష్ణ నటించి, నిర్మించారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన …. ఈ బయోపిక్ రెండు భాగాలుగా రూపొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి పార్ట్ ఎన్టీఆర్..కథానాయకుడు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ మహానాయకుడు రిలీజ్ కు సిద్దమైంది. ఈ నెల 22 న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మేరకు సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి
ఫస్ట్ పార్ట్ లో క్లైమాక్స్ ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో ముగిసింది. మరి మహానాయకుడు క్లైమాక్స్ దేనితో ముగిస్తారు అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం క్లైమాక్స్…ఎమోషనల్ గా ఉండబోతోంది. ఎన్టీఆర్ భార్య బసవతారకం చనిపోవటంతో ముగిస్తున్నారు. తొలి భాగంలో బసవతారకం పాత్ర …గతంలోకి వెళ్లి గుర్తు చేసుకోవటంతో సినిమా ప్రారంభం అవుతుంది. దానికి ముగింపు ఇక్కడ ఇస్తున్నారన్నమాట. ఇక ఈ సినిమాలో ఎక్కడా వివాదాస్పద అంశాలు లేకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసారు. రెండు గంటల ఎనిమిది నిముషాల లెంగ్త్ తో ఈ సినిమా చాలా క్రిప్స్ గా ఉండనుంది.
రెండో పార్ట్ లో రాజకీయాల్లోకి వచ్చాక… ఎన్టీఆర్ ఆయన ప్రయాణం ఎలా సాగింది? మహానాయకుడిగా ఎలా ఎదిగారు? అనే అంశాలతో ఈ రెండో భాగం రూపొందింది. ‘యన్‌టిఆర్’ మొదటి భాగం అనుకున్న ఫలితం రాబట్టకున్నా రెండో భాగంపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ వారు..అభిమానులు.