డ్రీమ్ ప్రాజెక్టు కాస్తా పీడకలగా మారిపోతోంది. నందమూరి బాలకృష్ణ ఎన్నో ఆశలతో ,అంచనాలతో చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పై ఆయనకే ఆసక్తి తగ్గిపోయిందని తెలిస్తోంది. తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అవటం బాలయ్య ఏ మాత్రం ఊహించలేదు.
సరే అనుకుని సెకండ్ పార్ట్ ట్రైలర్ వదిలితే దాన్ని అందరూ ట్రోల్ చేస్తున్నారు. కేవలం ఓ భజన వీడియో దాన్ని సోషల్ మీడియాలో కామెడీ చేస్తున్నారు. ఫస్ట్ పార్టులోనే తీవ్రమైన భజన చేశారనుకుంటే.. రెండో పార్టులో అంతకు మించి భజన కనిపిస్తూ ఉండటం విశేషం. అందులోనూ నాటి ప్రధాని ఇందిర ఎన్టీఆర్ కటౌట్ ను చూసి కృష్ణుడిగా భావించి నమస్కారం పెట్టుకున్నట్టుగా చూపించిన సీన్ మరింత విమర్శల పాలవుతోంది. ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో రాణించిన మాట వాస్తవమే కానీ..ఇలా ఇందిరాగాంధీ గురించి ఒక కల్పితన సన్నివేశాన్ని పెట్టడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
ఇవన్నీ బాలయ్య గమనిస్తూనే ఉంటున్నారట. దాంతో ఎంతో ఉత్సాహంగా మొదటి పార్ట్ ని ప్రమోట్ చేసిన బాలయ్య సెకండ్ పార్ట్ కు ప్రమోషన్ ని ప్రక్కన పెట్టేసారని తెలుస్తోంది.
ముఖ్యంగా మీడియా ముందుకు వెళ్తే ఫస్ట్ పార్ట్ గురించి ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన ఆలోచించి పూర్తిగా ప్రమోషన్ కు దూరం అయ్యిపోతున్నారని వినికిడి. అయితే ఇది ప్రాజెక్టుపై ఇంపాక్ట్ పడుతుందని చెప్తే..సినిమా బాగుండి హిట్ టాక్ వస్తే ఆ మౌత్ టాకే సినిమాని నిలబెడుతుందని ఆయన చెప్తున్నారట.
కేవలం మహానాయకుడు సినిమా రిలీజ్ నాలుగు రోజులే ఉంది. బాలయ్య మౌనం టీమ్ ని ఆందోళనలో పడేస్తోంది. అసలు రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయాలనేది క్రిష్ ఆలచోన అని, అది బ్యాక్ ఫైర్ అయ్యిందని బాలయ్య మండిపడుతున్నారట.
‘మహా నాయకుడు’ ఈనెల 22న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్‌గా నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రమిది. విద్యాబాలన్, రానా, సుమంత్, కల్యాణ్ రామ్ కీలక పాత్రధారులు. క్రిష్ దర్శకత్వం వహించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి.