‘ఎన్టీఆర్ మహానాయకుడు’: బాలయ్య సహకరించటం లేదా?

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం తొలిభాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలై భాక్సాఫీస్ ని గెలవలేకపోయింది. నందమూరి అభిమానుల్నినచ్చినా లాంగ్ రన్‌లో నష్టాలు తప్పలేదు.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న లెక్కలు ప్రకారం ఓవరాల్‌గా రూ. 50 కోట్ల నష్టాలను మిగిల్చినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రెండో పార్ట్ షూటింగ్ మొదలైంది. మహానాయకుడు టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం యూనిట్ పైనే కాక బాలయ్య పై కూడా తొలి భాగం ప్రభావం పడిందని సమాచారం.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం షూటింగ్ లో కొన్ని సీన్స్ ని దర్శకుడు క్రిష్ ..రీషూట్ పెట్టారట. బాలయ్య తప్పదు అన్నట్లు మొక్కుబడిగా చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. తొలి భాగం షూటింగ్ లో ఉన్న ఉత్సాహం ఏమీ ఈ పార్ట్ షూట్ లో కనపరచటం లేదని, ఆ ఇంపాక్ట్ సినిమా పై పడనుందని వినపడుతోంది.

అయితే ఇది కేవలం రూమరా..నిజమా అనేది మాత్రం తెలియరాలేదు. క్రిష్ మాత్రం తన శాయశక్తులా ఎలాగైనా ఈ సినిమా హిట్ కొట్టాలని ఉన్నారట. అయితే బాలయ్య సీరియస్ గా ఉండటం, ఆ జోష్ చూపకపోవటంతో క్రిష్ కు అగ్ని పరీక్షలా తయారైందిట. మరో ప్రక్క మణికర్ణిక చిత్రం వివాదం క్రిష్ చుట్టూ తిరుగుతోంది. దానికి సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్దితి. ఇలా రెండింటి మధ్యా క్రిష్ నలిగిపోతున్నారట.

బడ్జెట్ తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని అనేక బ్రేక్‌ల మధ్య ఈ షూటింగ్ నడుస్తోంది. ఇకపోతే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రానికి రెండు నెలల ముందు నుండే విపరీతమైన ప్రమోషన్స్ నిర్వహించారు. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ షూటింగ్ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ప్రమోషన్స్ ఇంకా ప్రారంభమే కాలేదనేది అభిమానులను ఆందోళనలో పడేస్తున్న అంశం.