`సాహో` కు ‘బాహుబలి’ సెంటిమెంట్

`సాహో` కు ‘బాహుబలి’ సెంటిమెంట్ ని ఫాలో అవుతున్న ప్రభాస్

సినిమా ఫీల్డ్ లో సెంటిమెంట్స్ ఎక్కువ. ఎవరు అవునన్నా కాదన్నా వాటిని ఫాలో అయ్యే వాళ్లు అవుతూనే ఉంటారు. కోట్లతో నడిచే బిజినెస్ కాబట్టి ఎవరూ తప్ప పట్టరు కూడా. తాజాగా ప్రభాస్ కూడా తన చిత్రం సాహో కోసం బాహుబలి సెంటి మెంట్ ని ఫాలో అవుతున్నారు. బాహుబలి తన కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం. అలాగే సాహో సైతం ఆ రేంజి అందుకోవాలని ఆలోచనతో తన ప్రీరిలీజ్ ఈవెంట్ వెన్యూ ని మార్చినట్లు సమాచారం.

మొదట సాహో చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ..ఎల్ బి స్టేడియం, హైదరాబాద్ లో ప్లాన్ చేసారు. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసిన రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఏర్పాటు చేయబోతున్నారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఖుషీగా ఉన్నారు. బాహుబలి 2 తో సమానంగా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `సాహో`. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు లాస్ట్ స్టేజ్ కు చేరుకున్నాయి. రిలీజ్ టైమ్ కరెక్ట్ గా నెల మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్ పై టీమ్ దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే సోషల్ మీడియా ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.