విజయదేవరకొండకి తన తమ్ముడు పీల్డ్ కు రావటం ఇష్టం లేదా?

రౌడీ స్టార్ కి చీవాట్లు.. అంత త‌ప్పేం చేశాడ‌ని?

ఆల్రెడీ ఫీల్డ్ లో ఉండి, నెంబర్ వన్ ప్లేసుకు పోటీ పడుతున్న అన్నగారు తనకు హెల్ప్ చేస్తాడని తమ్ముడు ఆశించటంలో తప్పేం లేదు. అయితే ఎవరి కాళ్ల మీద వాళ్ల నిలబడాలనే ఉద్దేశ్యం ఆ అన్నగారికి ఉంటే ఎవరూ ఏం చెప్పలేం…ఏమీ మాట్లాడలేం. విజయ్ దేవరకొండ సోదరుడు పరిస్దితి అదే. తన అన్న తనకు సపోర్ట్ చేయాలనకుంటున్నోడో లేదో అర్దం కావటం లేదట. తన చిత్రం టీజర్ విడుదలైతే ట్విట్టర్ లో చిన్న పోస్ట్ కూడా పెట్టలేకపోయాడే అని బాధపడుతున్నారట.

ఎందుకంటే విజయ్ దేవరకొండ లాంటి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో పెట్టే ట్వీట్ కు ఓ రేంజిలో క్రేజ్ ఉంటుంది. అది విజయ్ కు తెలియంది కాదు. కానీ తన సోదరుడు పరిచయం అవుతున్న చిత్రం విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నాడో ఎవరికీ అర్దం కావటం లేదు. కొందరైతే తన సోదరుడు ఫీల్డ్ కు రావటం ఇష్టం లేదని, నటుడుగా పూర్తి ట్రైనింగ్ తీసుకుని గ్రాండ్ గా ఎంట్రీ భావింటుందని విజయ్ భావిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు.

పోనీ విజయ్ దేవరకొండ ఇవన్నీ పట్టించుకునే సిట్యువేషన్ లో లేడు ..బిజిగా ఉన్నాడు అందామనుకుంటే..రీసెంట్ గా విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చిత్రం ట్రైలర్ ని తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో షేర్ మరీ విషెష్ చెప్పాడు. ఇది ఖచ్చితంగా తమ్ముడుకి కాలే విషయమే. అయితే విజయ దేవరకొండ ఎందుకు ఇలా సైలెంట్ గా ఉన్నాడు అనే విషయం తెలియాల్సి ఉంది.

సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా ‘దొరసాని’ చిత్రంతో పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రంలో యాంగ్రీస్టార్‌ రాజశేఖర్‌ కూతురు శివాత్మిక హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. ఈ కాంబినేషన్ కు మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ‘దొరసాని’అంటూ టైటిల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసినప్పటినుంచీ ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. వాటిని మరింత పెంచటానకా అన్నట్లు ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్‌. ఈ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

Dorasaani Official Teaser II Anand Deverakonda II Shivathmika Rajashekar II K V R Mahendra

తెలంగాణలోని ఒకప్పటి గడీల కాలంలో జరిగే కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ బాగానే ఆకట్టుకుంటోందనే చెప్పాలి. అయితే ఓ దొర కూతురుకి, ఓ సామాన్య కుర్రాడుకి మధ్య జరిగే లవ్ స్టోరీ అని అర్దమవుతోంది. తేజ మార్క్ చిత్రంలా ఈ సినిమా ఉండబోతోందని కామెంట్స్ వినపడుతున్నాయి.

సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో ‘మధుర’ శ్రీధర్, యష్‌ రంగినేని నిర్మించిన ఈ చిత్రం ద్వారా కేవీఆర్‌ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతాన్ని అందించారు.