చీకట్లో ‘చమ్మక్ చంద్ర’ చిలక్కొట్టుడు

బూతుతో నాలుగు రూపాయలు వెనుకోసువచ్చే విషయం మళ్లీ టాలీవుడ్ నిర్మాతలకు గుర్తు వచ్చింది. అందుకు కారణం అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 చిత్రాల సక్సెస్. అవి కేవలం హాట్ కంటెంట్ మీదే ఆడాయనే బ్రాంతిలో వరస పెట్టి హాట్ సినిమాలకు అంకురార్పణ చేసేస్తున్నారు దర్శక,నిర్మాతలు. అయితే అవన్నీ చిన్న చిత్రాలే కావటం చెప్పుకోదగ్గ విషయం. అందులో నటించేవాళ్లను కూడా చిన్నవాళ్లనే తీసుకుని హాట్ కంటెంట్ తో ట్రైలర్స్, పోస్టర్స్ వదిలి క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడా ఆ జాబితాలోకి జబర్దస్త్ చమ్మక్ చంద్ర కూడా చేరిపోయాడు.

జబర్డస్త్ కామెడీ షోతో మంచి పేరు తెచ్చుకున్న చమ్మక్ చంద్ర .. కమెడియన్ గా ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయనకి హీరోగాను చేసే ఛాన్స్ వచ్చింది. ఆయన హీరోగా రామసక్కనోళ్లు నిర్మితమవుతోంది. సతీశ్ కుమార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి రాజ్ కార్తికేన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

రీసెంట్ గా ఈ చిత్రానికి సంభందించి నాలుగున్నర నిమిషాల నిడివితో ఉన్న ఈ పాట..ని విడుదల చేసారు. ఆ పాట ఓ చిన్న సైజ్ బ్లూఫిల్మ్‌గా ఉందని కామెంట్స్ వచ్చాయి. ‘నాలో ఏదో తీయగా’ అంటూ మేఘనా చౌదరి, చమ్మక్ చంద్రలు కామక్రీడలో తేలిపోయినట్లుగా ఆ వీడియోలో చిత్రీకరించారు.

ముఖ్యంగా మేఘనా చౌదరి అంగాంగ ప్రదర్శనతో రెచ్చిపోయి నటించటం ట్రేడ్ లో క్రేజీగా మారింది. ఆ పాట రసికరాయుళ్ల హృదయాలను తట్టిలేపే విధంగా ఉండటంతో వైరల్‌గా మారింది. ఈ పాట చూసిన వాళ్ళు ఈ సినిమాకు చీకట్లో చిలక్కొట్టుడు అని పెడితే సరిపోయేది. చీకట్లో చితక్కొట్టుడుకు సీక్వెల్ అనుకుని వస్తారు అని జనం కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాకి ఘంటాడి కృష్ణ .. మహిత్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. హీరోగా చమ్మక్ చంద్ర ఏ స్థాయి సందడి చేస్తాడో చూడాలి మరి.