హిట్టుటాక్ లేక రెజీనా స్టార్ స్టేటస్ దూరమైంది!?

సూపర్ హీరోయిన్ మెటీరియల్ అన్న ఇమేజైతే వచ్చిందిగానీ, కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లే ప్రాజెక్టు ఇప్పటికీ ఒక్కటీ పడలేదు రెజీనాకు. వస్తున్న అవకాశాల్లో తనను తను ప్రూవ్ చేసుకుంటున్నా , చేస్తున్న ప్రాజెక్టులకు హిట్టుటాక్ లేక స్టార్ స్టేటస్ కు దూరమైంది. తాజాగా తమిళంలో మరో థ్రిల్లర్‌కు రెజీనా సైన్ చేసిందన్న టాక్ వస్తోంది. నిజానికి నయనతార చేయాల్సిన పాత్ర.. అటు ఇటు తిరిగి రెజీనాకు అందడంతో కెరీర్‌లో కొత్త మలుపు రావొచ్చన్న ఆశతోవుంది రెజీనా. భారీ బడ్జెట్ సినిమా సాహోలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అరుణ్ విజయ్‌కి ఆ సినిమా హిట్టుతో సంబంధం లేకుండా మంచి చాన్స్‌లు వస్తుండటం తెలిసిందే. తన మార్క్ చిత్రాల్లో హీరో పాత్రలు చేస్తూనే, పెద్ద ప్రాజెక్టుల్లో క్యారెక్టర్ రోల్స్‌తో మెప్పిస్తోన్న అరుణ్ విజయ్ తాజాగా తమిళ దర్శకుడు అరివజగన్‌తో కొత్త ప్రాజెక్టుకు టై అప్ అయ్యాడట. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబోలో కుట్రమ్ 23 రావడం తెలిసిందే. అరుణ్ విజయ్ -నయన్ జోడీగా కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కించటంలో జరిగిన ఆలస్యం కారణంగా నయన్ ప్రాజెక్టుకు దూరమైందన్న టాక్ వస్తోంది. తాజాగా ఆ పాత్ర కోసం రెజీనా కాసాండ్ర సైన్ చేసిందన్నది ఇండస్ట్రీ టాక్. త్వరలోనే ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు సినీ వర్గాలు!?