`సాహో`విషయంలో ఈ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేది
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న సినిమా `సాహో`. తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో రూపొందుతున్న హై బడ్జెట్ సినిమా `సాహో ` రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు మంచి హైప్ తీసుకువచ్చాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉండి. భారీ యాక్షన్ అడ్వంచరస్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా ఆగష్టు 30న విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టిక్కెట్ రేట్లు పెంచటానికి నిర్ణయించినట్లు సమాచారం.
ముఖ్యంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మొదట రెండు వారాలు ఈ టిక్కెట్ రేటు పెంచి అమ్మబోతున్నట్లు ట్రేడ్ వర్గాల ద్వారా సమచారం. గతంలోనూ పెద్ద సినిమాలు రిలీజ్ టైమ్ లో ఇలా రేట్లు పెంచటం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఫర్మిషన్ కోసం ట్రై చేస్తున్నట్లు వినికిడి. ఎక్కువ రేట్లు పెట్టి డిస్ట్రిబ్యూటర్స్ ఇలా రేట్లు పెంచటం వల్ల అది కొద్ది సమయంలోనే తాము పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చే అవకాసం ఉంటుంది.
దాదాపు రూ. 350 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రాబోతున్న ‘సాహో’ మానియాతో ఇండియన్ సినిమా లవర్స్ ఊగిపోతున్నారు. ఇదిలా ఉంటే సాహో బెనిఫిట్ షోలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం. ఆగష్టు 29 రాత్రి సాహో స్పెషల్ స్క్రీనింగ్ థియేటర్లలో రానున్నట్టు తెలుస్తోంది. ఏపీతో పాటు తెలంగాణలో కూడా సాహో బెనిఫిట్ షోలు ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితె టిక్కెట్ ధర రూ. 500/- నుంచి స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ అనుమతులు కోసం ప్రభుత్వానికి అభ్యర్థన చేసింది. అనుమతులు వచ్చిన వెంటనే ప్రకటన చేస్తుందని తెలిసింది.