‘సాహో’ కలెక్షన్స్ ఎంతవరకూ నిజం?

నిజమా :కలెక్షన్స్ తో సాహో అనిపిస్తున్న ప్రభాస్?

ఈ మధ్యకాలంలో పెద్ద సినిమా వస్తోందంటే కలెక్షన్స్ యుద్దం జరుగుతోంది. సినిమా పెద్ద హిట్ అనిపించుకునేందుకు ..కలెక్షన్స్ ని అమాంతం ఐదారు రెట్లు పెంచేసి ప్రకటించుకుంటున్నారు నిర్మాతలు. అప్పుడు యాంటి ఫ్యాన్స్ అసలు కలెక్షన్స్ తో ముందుకు వచ్చి నిలదీయటం సోషల్ మీడియాలో యుద్దాలకు దారి తీయటం జరుగుతోంది. ఇప్పుడు సాహో కు అలాంటిదే జరుగుతోందని అంటున్నారు.

బాహుబాలి తర్వాత అంతే రేంజ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘సాహో’ సినిమా మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.

తెలుగు ప్రేక్షకులు నెగటివ్ గా ఉన్నా ఉత్తరాదిన మాత్రం ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ నెలకొంది. అయితే టాక్ సంగతి ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం ఎక్కడా తగ్గడంలేదు. మొదటి రోజు వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ తో కలిసి రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేయగా రెండో రోజు కూడా అదే రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది.

ప్రభాస్ క్రేజ్ తో ఈ సినిమా రెండ్రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును అధిగమించింది.ఈ విషయాన్నీ ‘సాహో’ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అధికారికంగా వెల్లడించింది. రెండు రోజుల్లో తమ చిత్రం వరల్డ్ వైడ్ రూ.205 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని యూవీ క్రియేషన్స్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

అయితే నెగిటివ్ టాక్ ఇంతలా ఉండి, చాలా చోట్ల డ్రాప్ అయిన సిట్యువేషన్ లో అన్ని కోట్లు ఎక్కడ నుంచి వస్తాయి, ఫేక్ కలెక్షన్స్ అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. దాంతో అభిమానుల్లోనే ఓ రకమైన కన్ఫూజన్ వాతావరణం క్రియేట్ అవుతోంది. ఏది నమ్మాలో ..ఏది అక్కర్లేదో తెలియటం లేదు.