ఫ్యాన్స్ కు “సైరా” షాక్ ఇవ్వబోతోందా ?

“సైరా” వాయిదా పడుతోందా

స్టార్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం “సైరా నరసింహా రెడ్డి”.బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది.

రిలీజ్ విషయానికి వస్తే..“సైరా”కు బాలీవుడ్ స్టార్ హీరో హ‌ృతిక్ రోషన్ నుంచి భారీ పోటీ ఎదురవుతోంది. అక్టోబర్ రెండో తేదీనే హృతిక్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన “వార్” సినిమా హిందీతోపాటు ఇతర భాషల్లో కూడా విడుదలవుతోంది. దీంతో రెండు భారీ సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గితే మంచిదని “సైరా” టీమ్ భావిస్తోందట.

“సైరా” విడుదలను ఒక వారం వాయిదా వేసుకోమని “వార్” టీమ్ నుంచి కూడా రిక్వెస్టులు వచ్చాయట. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 8వ తేదీన విడుదల గురించి ఆలోచిస్తున్నట్టు సమాచారం.

250 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. మరో ప్రక్క తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది.