నిజమైతే ఎన్టీఆర్ డెసిషన్…షాకింగే

ఎన్టీఆర్ సాహసం సాధ్యమేనా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మొదటి నుంచీ డేర్ డెవిల్. ప్రతీ విషయాన్ని ఆచి,తూచి నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తిరగరు. ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా సార్లు ఆయన్ని అనేక మెట్లు ఎక్కించాయి. అయితే ఆయన సాహసమైన నిర్ణయం తీసుకున్నప్పుడల్లా అందరూ ఆశ్చర్యపోతూంటారు. ఇప్పుడు కూడా అలాంటి డెసిషన్ తీసుకున్నట్లు మీడియాలో వినపడుతోంది. అదేమిటంటే..

ప్ర‌స్తుతం`RRR` సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నారు. తార‌క్ ఈ చిత్రంలో తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇందులో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన విప్ల‌వ నాయ‌కుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. `బాహుబ‌లి` త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తోన్న చిత్ర‌మిది. భారీ అంచ‌నాల న‌డుమ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సినిమా కోసం తార‌క్ తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో డ‌బ్బింగ్ చెప్ప‌బోతున్నార‌ట‌. నాలుగు భాష‌ల్లో డ‌బ్బింగ్ చెప్ప‌డమంటే మామూలు విష‌యం కాదంటున్నారు సీనియర్స్. మ‌రి ఎనీఆర్ ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి మ‌రి అంటోంది మీడియా.