రీ ఎంట్రీకి లయ రెడీ!

తెలుగు హీరోయిన్‌గా కొంతకాలం కొనసాగి మంచి సినిమాలు చేసిన నటి లయ. ‘స్వయంవరం’తో అరంగేట్రం చేసి, మీడియం రేంజి చిత్రాలెన్నో చేసింది. ఎనిమిదేళ్లు ఇండస్ట్రీలోవున్న లయ కెరీర్ జోరు తగ్గుతున్న టైంలో పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. తరువాత సినిమాలకు దూరంగా ఉంటున్న లయ రీ ఎంట్రీకి సిగ్నల్స్ ఇస్తోందని అంటున్నారు. శ్రీను వైట్ల -రవితేజ కాంబినేషన్లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో కుమార్తెతో కీలక పాత్ర చేయించిన లయ, తళుక్కున మెరిసింది కూడా. అలా రీ ఎంట్రీకి సిగ్నల్స్ ఇచ్చిన లయ, ఎన్టీఆర్ అరవింద సమేతలాంటి పెద్ద సినిమాలో ముఖ్య పాత్ర చేసే అవకాశం వచ్చినా చెట్టంత కొడుకు (నవీన్‌చంద్ర)కు తల్లిగా కనిపించటం ఇష్టం లేక వద్దనుకుందట. లయ స్థానంలో ఆ పాత్ర చేసిన ఈశ్వరీరావుకు మంచి పేరొచ్చింది. ఆ పాత్రను వద్దనుకున్నానేగానీ, సినిమాలు చేయనని చెప్పలేదుగా అంటూ ఇండస్ట్రీకి లయ సంకేతాలిస్తోందని అంటున్నారు. భవిష్యత్తులో ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లతో కచ్చితంగా సినిమాలు చేస్తాననీ చెబుతోందట లయ.