ఆన్లైన్ డేటింగ్ సంస్కృతి ని నేను నమ్మను. వీటితో అవతలి వ్యక్తి ని సరిగా తెలుసుకునే అవకాశం దొరకదు. వాళ్లు ఎంతవరకు నిజాయితీపరులో తెలీదు. కలిసి ప్రయాణం చేస్తేనే వారి మనస్తత్వం అవగతం అవుతుంది” అంటోంది అందాలతార కియారా అద్వానీ. కియారా అద్వానీ ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా నచ్చిన భాగస్వామిని ఎంచుకునే అమ్మాయి పాత్రలో ‘ఇందూ కీ జవానీ’ చిత్రంలో నటిస్తోంది. డేటింగ్ యాప్స్ గురించి కియారా ఏం చెబుతుందో ఆమె మాటల్లోనే…’నాకు కాలేజీ రోజుల్లో ప్రేమ ప్రతిపాదనలు చాలానే వచ్చాయి. ఆ వయసులో ఏదో తెలియని ఆకర్షణ సహజం… అందుకే వాటిని అపరిపక్వమైనవిగానే భావించాను. ఎవరినీ ప్రేమించలేదు. సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల మనసైన వ్యక్తి గురించి ఆలోచించే తీరిక లేకుండా పోయింది. ప్రస్తుతం నా దృష్టంతా సినిమాల మీదనే ఉంది. ఇప్పుడు నేను సింగిల్గానే ఉన్నాను. నచ్చిన వ్యక్తి తారసపడితే.. అందరికీ ఆ విషయాన్ని వెల్లడిస్తాను. ఆ రహస్యాన్ని దాచిపెట్టుకోను” అని చెప్పింది.
ఆ రహస్యాన్ని దాచిపెట్టుకోను!
