తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రకరకాల పాత్రలు చేస్తూ నటిగా గత పదిహేనేళ్లుగా కొనసాగుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. కొన్నిసార్లు స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. తాజాగా చిరంజీవి ‘సైరా’లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే, ఆ సినిమా తర్వాత ఇండస్ట్రీలో గొప్పగా అవకాశాలు వస్తాయని ఎన్నో కలలుకంది. అవేమీ జరగలేదు. ఆమె ఆశలు అడియాసలయ్యాయి. ఇప్పుడు టాలీవుడ్ లో తమన్నా కెరీర్ సందిగ్ధంలో పడింది. ఆశించిన అవకాశాలు రావడంలేదు. తమన్నాని ‘ అవుట్ డేటెడ్ పీస్’ అని పరిశ్రమ వర్గాలు అంటున్నారట! కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూ గ్లామరస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ, తమన్నా ఎప్పుడూ కొన్ని హద్దులు దాటలేదు. మితిమీరి ముద్దు సీన్లు ఇప్పటివరకు చేయలేదు. అయితే, గ్లామరస్‌గా కనిపించడానికి మాత్రం తనెప్పుడూ సిద్ధమేనని చెప్పింది. అయినా అవకాశాలు ఎందుకో వెక్కిరిస్తున్నాయి. ఇక లాభం లేదనుకున్న తమన్నా- ఇప్పుడు నటిగా ఓ కొత్త ప్లాట్‌ఫామ్‌లోకి ప్రవేశించింది. ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తూ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘వికడన్ టెలీవిస్తాస్’ నిర్మిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లోఆమె లీడ్ రోల్ చేస్తోంది . ఈ వెబ్ సిరీస్ ‘హాట్‌స్టార్’లో ప్రసారం కానుంది. ఈ సిరీస్ ఏ జానర్‌లో ఉండబోతోంది.. ఎవరు దర్శకత్వం వహిస్తున్నారనే సమాచారం బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టేజ్‌లో ఉంది. ఇది కాకుండా హిందీలో ‘బోల్ చుడియా’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్న తమన్నా… తమిళంలో ఓ సినిమా కూడా కమిట్ అయ్యింది. ఇవి సరే.. మరి టాలీవుడ్ మాటేంటి? అంటే తమన్నా నోరుమెదపడం లేదు. “సహజంగానే సినిమా ఇండస్ట్రీ పురుషాధిక్య ప్రపంచం. హీరోలకు ఇచ్చే ప్రాధాన్యతతో పోలిస్తే… హీరోయిన్‌లకు ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ” అంటోంది. ఏది ఏమైనా.. టాలీవుడ్ లో తమన్నాఇక ‘అవుట్ డేటెడ్ పీసే!’ ఏమంటారు?oo
‘అవుట్ డేటెడ్ పీస్ తమన్నా!’
