కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల చేరతారా.? ఏం జరగబోతోంది.?

కాంగ్రెస్ నాయకులతో వైఎస్ షర్మిలకు ఏంటి పని.? పదే పదే కర్నాటక కాంగ్రెస్ నేతలతో వైఎస్ షర్మిల ఎందుకు మంతనాలు జరుపుతున్నట్టు.? వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఒకప్పుడు డీకే శివకుమార్‌కి ఎంత సన్నిహిత సంబంధాలుంటే మాత్రం.? ఆయనతో పదే పదే షర్మిల భేటీ అవుతోంటే, వేరే సంకేతాలు వెళతాయ్ కదా.?

ఔను, తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఖేల్ ఖతం.. అనే సంకేతాలు అయితే వెళ్ళిపోయాయి. వైఎస్ షర్మిల, తెలంగాణ రాజకీయాలు వదిలేస్తారనీ, ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు స్వీకరిస్తారనీ గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజానికి, వైఎస్ షర్మిల అంత రిస్క్ తీసుకోలేరు. ‘తెలిసి తెలిసి ఎవరు మాత్రం ప్రాణమ్మీదకు తెచ్చుకుంటారు.?’ అంటూ కొందరైతే సోషల్ మీడియా వేదికగా సెటైర్లు కూడా వేస్తున్నారు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఘటనను ప్రస్తావిస్తూ.

అయితే, వైఎస్ షర్మిల ఎందుకు డీకే శివకుమార్‌తో పదే పదే భేటీ అవుతున్నారన్నదానిపై భిన్న వాదనలున్నాయి. డీకే శివకుమార్ కర్నాటక ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు. కానీ, ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకున్నారు.

కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం చేయాలంటే, డీకే శివకుమార్‌ని బయటకు లాగేస్తే సరి. ఆ బాధ్యతని బీజేపీ, షర్మిల భుజాన పెట్టిందనే వాదనలు లేకపోలేదు. మరి, కాంగ్రెస్‌లో షర్మిల చేరతాన్న ప్రచారం వెనుక అసలు కారణమేంటో.!