Gurumoorthy vs Pattabhi: పట్టాభి వర్సెస్ గురుమూర్తి… ఏది నిజం.. ఏది అసత్య ప్రచారం..?

Gurumoorthy vs Pattabhi: ఏపీ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన విషయం.. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంతో ప్రైవేటీకరించడం అనే అంశం. ఇప్పుడు ఈ విషయంపై ఏపీలో రాజకీయం రగిలిపోతుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఘాటుగా రియాక్ట్ అవుతుంది. ఇటీవల ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ చేపట్టి గవర్నర్ ను కలిసి విషయం చెప్పి, విన్నవించారు. ఈ నేపథ్యంలో.. తమ్ముళ్లు ముద్దుగా కమాండర్ అని పిలులుచుకునే స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి టాపిక్ ఎత్తడంతో రెండు రకాల చర్చలు వచ్చాయి.

ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి..

ఢిల్లీలో పీపీపీ విధానానికి అనుకూలంగా సంతకాలు పెట్టి, రాష్ట్రంలో అందుకు వ్యతిరేకంగా సంత‌కాల సేక‌ర‌ణ పేరుతో హడావుడి చేస్తున్నారా వైసీపీ నేతలు?

పట్టాభి ఆరోపిస్తున్నట్లు.. ఢిల్లీలో గురుమూర్తి చేసింది వాస్తవంగా అదేనా?

అసలు హస్తినలో వైసీపీ ఎంపీ చేసిన సంతకానికీ.. ఏపీలో జరిగిన నిర్మాణాలకి ఏమైనా సంబంధం ఉందా..?

టీడీపీ ఈ విషయంపై మురిసిపోవడానికీ… కాస్తంత బుర్ర పెట్టి ఆలోచిస్తే అసలు విషయం అర్ధం అవుతుందని వైసీపీ చెప్పడానికి గల కారణాలు ఏమిటి?

ఏది నిజం.. మరేది అసత్య ప్రచార.. మరేది బుర్ర తక్కువ ఆలోచన..?

దేశ‌వ్యాప్తంగా వైద్య క‌ళాశాల‌లు, ప్రజారోగ్యం అంశంపై పార్లమెంట‌రీ స్టాండింగ్ క‌మిటీని నియ‌మించారు! ఈ క‌మిటీ.. దేశ‌వ్యాప్తంగా ప‌ర్యటించి.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి స‌మాచారం సేక‌రించింది. అనంత‌రం.. ఈనెల 10న కేంద్రానికి నివేదిక స‌మ‌ర్పించింది. ఈ నివేదిక‌పై వైసీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా సంత‌కం చేశారు!

11 మంది స‌భ్యులు ఉన్న ఈ పార్లమెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ త‌న రిపోర్టులో.. వైద్య క‌ళాశాల‌ల‌ను పీపీపీ విధానంలో నిర్మించుకోవ‌చ్చని సిఫార‌సు చేసింది! ఇదే సమయంలో… ఈ విధానం వల్ల ఖ‌ర్చు కూడా త‌గ్గుతుంద‌ని.. ప్రభుత్వాల‌పై భారం ఉండ‌ద‌ని కూడా పేర్కొంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పిన‌ట్టు నివేదిక‌లో పేర్కొంది!

ఈ నేపథ్యంలోనే… మెడిక‌ల్ కాలేజీల‌ను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలనే ప్రతిపాద‌న‌కు పార్లమెంట‌రీ స్థాయి సంఘం స‌భ్యుడిగా గురుమూర్తి మ‌ద్దతు ప‌లికారంటూ కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ చెప్పుకొచ్చారు. ఓపక్కా ఢిల్లీలో పీపీపీ విధానానికి అనుకూలంగా సంతకాలు పెట్టి, మరోవైపు రాష్ట్రంలో మాత్రం అందుకు వ్యతిరేకంగా సంత‌కాల సేక‌ర‌ణ పేరుతో హడావుడి చేయ‌డం ఏంట‌ని ఆయ‌న ప్రశ్నించారు.

దీంతో… దున్నపోతు ఈనిందంటే దుడను కట్టేయండి అన్నట్లుగా ఈ విషయంపై కాస్త మెదడు పెట్టి ఆలోచించని వారు… సోషల్ మీడియా వేదికగా కమాండర్ పట్టాభి సరికొత్త విషయాన్ని కనుగొన్నారని.. ఇది వైసీపీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమంటూ రకరకాల పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు! ఇక ఒక వర్గం మీడియాలో జర్నలిస్టుల ముసుగులో ఉన్న కుహనా మేధావులు వేసుకున్న సూట్లు నలిగిపోయేలా విరుచుకుపడిపోయారు!

YS Jagan

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించడానికి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మద్దతు పలికింది. అది ఎప్పుడు..? మొదలుపెట్టడమే అలా మొదలు పెడితే! అంటే.. అనుమతులు దక్కిన అనంతరమే పీపీపీ విధానం కోసం ప్రైవేటు వ్యక్తులు లేదా, సంస్థలను ఆహ్వానించి.. వారితో కలిసి మొదలుపెట్టడం. అంతే కానీ.. ప్రభుత్వం నిర్మించిన, మొదలుపెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పనంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి కాదు.

ఇక్కడ సరిగ్గా గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఏపీలో జగన్ ప్రభుత్వం ఆ మెడికల్ కాలేజీలను పూర్తిగా ప్రభుత్వం నుంచే నిర్మించారు, నిర్మాణాలు చేపట్టారు తప్ప పీపీపీ విధానంలో నిర్మించ‌లేదు. ప్రభుత్వమే ఐదు మెడిక‌ల్ కాలేజీల్ని పూర్తి చేసింది.. మ‌రో రెండింటి నిర్మాణాలు దాదాపు పూర్తి చేసింది! ఆ విషయం గ్రహించకుండా… స్వయంప్రకటిత మేధావులు పార్లమెంట్ కమిటీ సిఫార్సులను తప్పుగా చూపించే పనికి ప్రయత్నిస్తుండగా.. అన్నీ తెలిసినా కొంతమంది అడ్డంగా సమర్ధిస్తుండటం పూర్తిగా నిస్సిగ్గు చర్య అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

మన పాలన బాగాలేదు || Analyst Ks Prasad Reacts On Chandrababu Collectors Meeting Comments || TR