తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడెక్కడ.? టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడెక్కడ.? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం తెలుగు తమ్ముళ్ళు వెతుక్కోవాల్సి వస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం కాస్తో కూస్తో హల్‌చల్ చేస్తున్నారు. అయితే, లోకేష్‌కి టీడీపీ అనుకూల మీడియా కొంత స్పెషల్ కవరేజ్ ఇస్తున్నా, తెలుగు తమ్ముళ్ళు, తమ పార్టీ ప్రదర్శన పట్ల అంత కాన్ఫిడెంట్‌గా కనిపించడంలేదు ఇటీవలి కాలంలో.
కానీ, అనూహ్యంగా జనసేన పార్టీ రేసులో ముందుకొచ్చింది. ఒకే ఒక్క కార్యక్రమంతో జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్‌లో ‘ప్రధాన ప్రతిపక్షం’ అనే ఇమేజ్‌ని సంపాదించుకోగలిగింది. జనసేన ముందుకు రావడంతో, భారతీయ జనతా పార్టీ కూడా డల్ అయిపోయిందన్న చర్చ నడుస్తోంది. కానీ, జనసేన అధినేత, తమ పార్టీకి తీసుకొచ్చిన ఈ అనూహ్యమైన మైలేజ్‌ని ఎన్ని రోజులపాటు కొనసాగించగలరు.? అన్నదే అసలు క్వశ్చన్. పవన్ కళ్యాణ్, సినిమాల్లో బిజీ అవుతున్నారు.
‘వకీల్ సాబ్‘ పూర్తయ్యింది, క్రిష్ దర్శకత్వంలో సినిమా షూట్‌కి హాజరు కాబోతున్నారు కూడా. హరీష్ శంకర్ సినిమా, సురేందర్ రెడ్డితో సినిమా.. ఇలా లిస్ట్ చూస్తే పెద్దదే వుంది. కానీ, అటు రాజకీయాల్ని, ఇటు సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తేనే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ‘లైవ్‌లో’ వుంచగలరు. రైతుల సమస్యలపై వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడంలో జనసేన పార్టీ సక్సెస్ అయ్యింది. చాలామంది మంత్రులు, వైసీపీ నేతలు మీడియా ముందుకొచ్చి, జనసేన పార్టీపై ఇంత స్థాయిలో విమర్శలు చేస్తున్నారంటే, జనసేన పార్టీకి పొలిటికల్ మైలేజ్ పెరిగినట్లే లెక్క.
ఈ విషయమై జనసేన శ్రేణులు కాస్త సంతోషంగానే వున్నాయి. అయితే, మీడియా నుంచి తగినంత కవరేజ్ మాత్రం జనసేన కార్యక్రమాలకు రావడంలేదు. అదంతా టీడీపీ చేతుల్లో వున్న మీడియానే. టీడీపీ తర్వాత ఆ సపోర్ట్ కాస్తో కూస్తో బీజేపీకి వెళుతుందేమోగానీ, జనసేనకు మీడియా నుంచి ఎలాంటి సపోర్ట్ వుండకపోవచ్చు. ఇవన్నీ లెక్కలేసుకుంటే, జనసేనాని ఎంత కష్టపడ్డా ప్రయోజనం వుండకపోవచ్చనది రాజకీయ విశ్లేషకుల అంచనా.