ఉదయమే టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడంతో తెలుగు రాష్ర్ట ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏడాది కాలంగా సైలెంట్ గా ఉన్న జగన్ సర్కార్ ఊహించని విధంగా పచ్చ తమ్ముళ్లకు షాక్ షురూ చేసింది. అచ్చెన్న అరెస్ట్ తో ఇప్పుడు పచ్చ తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గొంతు మింగుడు పడటం లేదు. అవినీతి, అక్రమాల కుంభ కోణాలకు పాల్పడ జాబితా సిద్దం చేసిన సర్కార్ ఏసీబీతో దాడులు షూరూ చేయించింది. టీడీపీలో పెద్ద తలకాయల్ని అన్నింటిని టార్గెట్ చేసి వరుసగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.
ఈ రోజు రాత్రి వరకూ ఎంత మందిని అదుపులోకి తీసుకుంటారో తెలియని సన్నివేశం ఎదురైంది. సరిగ్గా జగన్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా పచ్చ తమ్ముళ్లకు ఇచ్చిన గిప్ట్ గా సోషల్ మీడియాలో మార్మొగిపోతుంది.జగన్ మాటకు మాట..దెబ్బకు దెబ్బ టైమ్ చూసి కొడుతున్నారని తెలుస్తోంది. జగన్ ని అవినీతి కేసుల్లో జైలుకు పంపించడం అచ్చెన్నాయుడు కీలక పాత్ర పోషించారు. మీడియా సమావేశాల్లో జగన్ పై సంచలన ఆరోపణలు చేసిన వ్యక్తిగా అచ్చెన్న పేరు అప్పట్లో మారు మ్రోగిపోయింది. సరిగ్గా ఇప్పుడు కక్ష సాధింపు గా అనుకున్నా..మరో విధంగా అనుకున్నా ఈఎస్ ఐ కేసులో అచ్చెన్న అక్రమాలకు పాల్పడింది మాత్రం వాస్తవం గా తెలిసింది.
ఈ రోజు సాయంత్రం విజయవాడ ఏసీబీ కోర్టులో అచ్చెన్నను అధికారులు ప్రొడ్యూస్ చేయనున్నారు. మీడియా అంతటా ఇప్పుడిదే హాట్ టాపిక్. అయితే ఈ అరెస్ట్ పై టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడు మరోలా స్వరం వినిపిస్తున్నారు. సరిగ్గా అసెంబ్లీ సమావేశాలకు ముందుగా అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేసారని ఆరోపించారు. అచ్చెన్న ఆచూకి చెప్పాలని డీజీపీని డిమాండ్ చేస్తున్నారు. అలాగే హోమంత్రి తక్షణం రాజీనామా చేయాలన్నారు. అచ్చెన్న కిడ్నాప్ బలహీన వర్గాల దాడికింద చెప్పుకొచ్చారు. రాత్రికి రాత్రే అచ్చెన్న ఇంటిపై 100 మంది పోలీసులు దాడి చేసి కిడ్నాప్ కు పాల్పడినట్లు ఆరోపించారు. ఆయన కుటుంబ సభ్యులు ఫోన్ లోసంప్రదిస్తుంటే అందుబాటులోకి రాలేదన్నారు. ఇదంతా పక్కా ప్లానింగ్ ప్రకారమే జరిగిందని మండిపడ్డారు.