చింతమనేని ప్రభాకర్ ఈ పేరు తెలియని వాళ్లు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన వ్యవహారశైలే ఇందుకు కారణం. వివాదాస్పద నేతగా ఆయకు వచ్చిన అపఖ్యాతి అంతా ఇంతా కాదు. ఈయన నోరు విప్పారంటే ఎదుటి వాళ్లు జడుసుకోవాల్సిందే … తిక్కరేగి బూతుపురాణం అందుకున్నారంటే ఇక అంతే సంగతులు. అప్పట్లో ఎన్ని అవాంతరాలు వచ్చినా నోటికి కళ్లెం వేసే వాడు కాదు. కాని వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చినా తర్వాత సీన్ మారిపోయింది. జగన్ సర్కారు పాత కేసులు అన్నీ తిరగదోడుతుండడంతో చింతమనేని దూకుడుకు బ్రేకులు పడ్డాయి. దీంతో మాట్లాడడమే కాదు కనిపించకుండానే పోయారు. దీంతో చింతమమేనిలో పులుపు చచ్చిపోయిందోచ్ అంటూ దెందులూరు వాసులు గుసగులాడుకుంటున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెల్చిన చింతమనేని తీరు అదినుంచి అంతే… ఎంపీటీసీ నుంచి రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టినా తర్వాత కూడా గల్లీ రాజకీయాలు మార్చుకోలేదు. కాని ఇప్పుడు అన్నీ మూసుకున్నారు. ముఖ్యంగా నోటికి తాళం వేసుకున్నారు. గతంలో తనను కాని, తన అధినేత చంద్రబాబు నాయుడిని కాని, టీడీపీ కాని పల్లెత్తు మాటన్నా తట్టుకోలేని ఆయన … ఇప్పుడు నవరంద్రాలు మూసుకున్నారు. అనుభవం అయితే కాని తత్వం బోధపడదు అన్నట్లు ఇప్పుడు మౌనముద్ర దాల్చారు.
అక్రమ ఇసుక వ్యాపారంతో అప్పట్లో బాగానే వెనకేసుకున్నారు. అటు అధికార బలానికి, అర్థబలం తోవడంతో తెగ రెచ్చిపోయేవారు. అధికారులపై నోరుపారేసుకోవడం, తప్పుపట్టిన వాళ్లపై విరుచుకుపడడం అప్పట్లో ఆయనకుక చాలా కామన్. అయితే కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడంతో ఈ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. దీనికితోడు జగన్ సర్కారు ఆయన ముందటి కాళ్లకు బంధం వేయడంతో తీరు మార్చుకోవాల్సి వచ్చింది. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈయనపై 2019 వరకు 29 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అప్పట్లో అధికారం టీడీపీ చేతిలో ఉండడంతో అరెస్టులు, రిమాండ్ లు గట్రా ఏమీ లేవు. కాని ఇప్పుడు వైసీపీ ఊరుకోదు కదా… పాత కేసులు అన్నీ తిరగదోడుతోంది. ఒక కేసులో బెయిల్ వస్తోందని తెలియగానే ఇంకో కేసు పెట్టేస్తోంది. ఈ కారణంగానే గతంలో కొంత కాలం జైల్లోనే ఉండాల్సి వచ్చింది.
అప్పట్లో నలుగురు ముందు వట్టి వసంత కుమార్ కాలర్ పట్టుకొని హంగామా చేశాడు. ఆ కేసు ఇప్పుడు హైకోర్టులో నడుస్తోంది. వట్టి వసంతకుమార్ కనికరించి జాలి తలచివదిలేస్తే తప్ప ఈకేసు నుంచి బయటపడే మార్గం కనిపిచండం లేదు. ఇక దీంతో పాటు పలు ఇసుక కేసులు…ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నడుస్తున్నాయి. మొత్తం మీద ఎంత మంది ఎన్నిరకాలుగా చెప్పిన రాని బుద్ది జైలు జీవితంతో వచ్చింది. మునుపటిలా నోరు పారేసుకోవడం లేదు. అయితే ఈ బుద్ధి ఎన్నాళ్లు ఉంటుందో అని దెందులూరు వాసులే గుసగుసలాడుకుంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు కూడా చింతమనేని లైట్ తీసుకుంటున్నారని సమచారం. అందుకే ఇటీవలే ప్రకటించిన టీడీపీ జాతీయ కార్యవర్గంలో ఆయనకు చోటు కల్పించలేదంటా…సో ఇదండీ సంగతి. అన్నీ బాగున్న రోజుల్లో కన్నూ మిన్నూ కానకుండా వ్యవహరిస్తే ఎంతటి వాళ్లకు అయినా కష్టాలు తప్పవు. కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదా.