కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విజయలక్ష్మీ గాంధీ భవన్ కు పెట్రోల్ బాటిల్ తో వచ్చారు. గాంధీ భవన్ కు ఉత్తమ్ ను కలిసేందుకు విజయలక్ష్మీ రాగా ఉత్తమ్ అందుబాటులో లేరు. అక్కడే ఉన్న టిపిసిపి నేత హన్మంతరావును విజయలక్ష్మీ కలిశారు. దాంతో హన్మంతరావు… నీ పర్సనల్ లైఫ్ విషయాలతో గాంధీ భవన్ కు ఏం సంబంధం అని గద్దాయించారు. అప్పుడే ఆమె చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్ ను గమనించి ఆమెను బయటికి పంపాల్సిందిగా సిబ్బందికి సూచించాడు.
దాంతో విజయలక్ష్మీ తాను పీసీసీ చీఫ్, వారి సతీమణి గారితో ఫోన్ లో మాట్లాడానని వారిని కలిసేందుకు వచ్చానని విజయలక్ష్మీ అన్నారు. విషయం తెలుసుకున్న గాంధీ భవన్ పోలీసు సిబ్బంది ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. గ్రండ్ర వెంకటరమణారెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని విజయలక్ష్మీ ఆరోపించిన విషయం తెలిసిందే.