ఉదయం లేవగానే 30 సెకన్లు ఇది చూస్తే.. అదృష్టం మీ తలుపు తడుతుంది..!

ఉదయం లేచిన వెంటనే రోజంతా మనసుకు ఉత్సాహం నింపే చిన్న పనులు చేస్తే జీవితం సానుకూలంగా మారుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఇంట్లో కొన్ని ప్రత్యేక చిత్రపటాలను సరైన దిశల్లో ఉంచి వాటిని ఉదయం 30 సెకన్ల పాటు చూసే అలవాటు పెంచుకుంటే అదృష్టం, శ్రేయస్సు, ఆనందం మన గృహంలోకి అడుగు పెడతాయని నమ్మకం ఉంది.

వాస్తు ప్రకారం ఇంట్లో రామ దర్బార్ చిత్రాన్ని డ్రాయింగ్ రూమ్ లేదా లివింగ్ రూమ్‌లో ఉంచితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుందని పిండితులు చెబుతున్నారు. అలాగే పరిగెత్తే గుర్రాల ఫొటోను కార్యాలయంలో ఉంచడం ద్వారా పనులు త్వరగా పూర్తవుతాయట.. ఇక వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. గుర్రాన్ని శక్తి, పట్టుదల, విజయానికి చిహ్నంగా భావిస్తారు.

సంపద కోసం ప్రతి ఇంటిలోనూ లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచడం శ్రేయస్కరం. ప్రత్యేకంగా ఇంటి ఉత్తరం దిశలో ఉంచితే ఆర్థికాభివృద్ధి చేకూరుతుందని విశ్వాసం. అంతేకాకుండా, లివింగ్ రూమ్ లేదా గెస్ట్ రూమ్‌లో హంస చిత్రాన్ని ఉంచడం ద్వారా శాంతి, శ్రేయస్సు పెరుగుతాయని పండితులు అంటున్నారు. భార్యా భర్తల సంబంధాలు మధురంగా ఉండాలని కోరుకునేవారు రాధా-కృష్ణుల చిత్రాన్ని బెడ్‌రూమ్‌లో ఉంచాలి. ఇది నిజమైన ప్రేమ, అవగాహనకు ప్రతీక. అలాగే వంటగదిలో మాత అన్నపూర్ణ ఫొటో ఉంచితే ఇంట్లో ఎప్పుడూ అన్నపానీయాలు కొరత ఉండవు అని తెలిపారు.

వాస్తు ప్రకారం ఒక ప్రత్యేకమైన శక్తి చక్రంను ఇంట్లో ఉంచుకోవడం కూడా అత్యంత శుభప్రదం. ప్రతిరోజూ ఉదయం బ్రాహ్మి ముహూర్తంలో, సాయంత్రం గోధూళి ముహూర్తంలో కనీసం 30 సెకన్లు ఈ శక్తి చక్రాన్ని తిలకించడం ద్వారా సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని నమ్మకం. వాస్తు శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం, చిత్రాలు కేవలం అలంకారమే కాదు, మనసులో సానుకూల భావాలు నింపే శక్తివంతమైన ప్రతీకలు. అవి సరైన ప్రదేశంలో ఉంటే ఇంటి వాతావరణం మారిపోతుంది అంటున్నారు. కుటుంబంలో ఐక్యత, ఆర్థిక స్థిరత్వం, ప్రేమ, శాంతి, సంపద లభిస్తాయని నమ్మకం.

ఇంటిని అందంగా తీర్చిదిద్దడమే కాదు, వాస్తు సూత్రాల ప్రకారం ఈ చిన్న మార్పులు చేస్తే మనసుకు సంతోషం, జీవితానికి శ్రేయస్సు తప్పక చేరతాయని విశ్వాసం. (గమనిక: ఈ కథనం నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని మేము ధృవీకరించడం లేదు.)