ఉదయం లేవగానే అర నిమిషం ఇలా చేస్తే.. మీకు జీవితంలో తిరుగుండదు..!

ఈ రోజుల్లో ఎవరికైనా ఇల్లు కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు… అది ఒక భావన. ఒక ఇంటిని సంతోషంగా, శుభంగా మార్చే తంతు వాస్తు శాస్త్రం. ఈ శాస్త్రం ప్రకారం, ఇంట్లో కొన్ని చిత్రాలు సరైన దిశలో ఉంచితే అదృష్టం వస్తుందట. హోం డెకరేషన్‌కి మించిన శక్తినిచ్చే ఈ ఫోటోలు… ఇప్పుడు నెగటివ్ ఎనర్జీని దూరం చేసి, శ్రేయస్సును ఆహ్వానించాలనుకునేవారికి తప్పనిసరి మార్గం అవుతున్నాయి.

ఇక ఇంట్లో రామదర్బార్ చిత్రం ఉండటం కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంపొందిస్తుందని నమ్మకం. ఈ ఫోటోను లివింగ్ రూమ్‌లో ఉంచితే కుటుంబ కలహాలు తగ్గుతాయట. అలాగే, పరిగెత్తే గుర్రాల చిత్రం విజయానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఒకేసారి ఎన్నో గుర్రాలు పరిగెత్తే దృశ్యం కార్యాలయంలో ఉంచితే, అడ్డుదిడ్డులుగా నిలిచిపోయిన పనులు కూడా ఊపందుకుంటాయి. ఇది కేవలం విజువల్ ఇన్‌స్పిరేషన్ మాత్రమే కాదు, వాస్తు ప్రకారం శక్తివంతమైన చిహ్నం కూడా.

ఇంకా లక్ష్మీదేవి చిత్రపటం ఇంటి ఉత్తర భాగంలో ఉంచితే సంపద ప్రవాహం ఎప్పుడూ కొనసాగుతుందట. అదే విధంగా, హంస చిత్రాన్ని గెస్ట్ రూమ్‌లో ఉంచడం శుభదాయకంగా పరిగణించబడుతుంది. హంస అంటే శ్రేయస్సు, అందం, ప్రశాంతతకి ప్రతీక. ఇక రాధాకృష్ణుల ఫోటో బెడ్‌రూమ్‌లో ఉంటే భార్యాభర్తల మధ్య ప్రేమ మరింత బలపడుతుందని నమ్మకం. ప్రేమకు జీవ రూపంగా నిలిచే ఈ జంటకు దేవతా స్థానం వాస్తువులో ప్రత్యేకంగా ఉంది.

వంటగదిలో మాత అన్నపూర్ణ ఫోటో ఉంటే ఇంట్లో ఎప్పుడూ ఆహార సమృద్ధి నిలిచిపోతుందని నమ్మకం. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక అంశం కాదు, కడుపు నిండితే మనస్సు కూడా నిండుతుందన్న సూత్రాన్ని గుర్తుచేస్తుంది. ఇక శక్తిచక్రం గురించి చెప్పుకుంటే దీన్ని రోజు రెండుసార్లు ఉదయం బ్రాహ్మి ముహూర్తంలో, సాయంత్రం గోధూళి వేళల్లో 30 సెకన్ల పాటు చూసినట్లయితే నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి ఫోటోలు మాత్రమే కాదు… మన ఇంటికి శుభాలను ఆహ్వానించే కీలకమైన విషయాలు.. సరైన దిశలో, సరైన ఉద్దేశంతో ఉంచితే ఇంట్లో శాంతి, ప్రేమ, విజయం, సంపద అన్నీ కలిసి వస్తాయట. ఒకసారి ప్రయత్నించి చూడండి… మార్పు కచ్చితంగా కనిపిస్తుందని పండితులు చెబుతున్నారు.