Konda Surekha: నాగార్జున కుటుంబానికి క్షమాపణలు చెప్పిన మంత్రి కొండా సురేఖ, వ్యాఖ్యలు ఉపసంహరణ

నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఉపసంహరించుకున్నారు. నాగార్జున కుటుంబాన్ని నొప్పించాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేస్తూ, ఈ మేరకు మంగళవారం అర్థరాత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తన వ్యాఖ్యల వల్ల ఏదైనా అపోహలు కలిగినట్లయితే చింతిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలన్నా లేదా అపకీర్తి కలిగించాలన్నా ఉద్దేశం తనకు ఎప్పటికీ లేదని మంత్రి తెలిపారు.

నాగార్జున పరువు నష్టం పిటిషన్‌పై నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు ఒక రోజు ముందు ఆమె క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.

జూబ్లీహిల్స్ వార్ | Jounalist Bharadwaj Reaction On Jubilee Hills By Election | BRS Vs Congress | TR