తాడిని తన్నేవాడుంటే వాడి తలని తన్నేవాడుంటాడని సామెత. ప్రస్తుతం టీడీపీలో ఇదే సూత్రం అప్లై అవుతుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. పైగా ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే ధృవీకరించారు కూడా! దీంతో… రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో… టీడీపీ కేడర్ చంద్రబాబుని బలంగా నమ్మాలని, మరింతగా నమ్మాలని, నమ్మకం విషయంలో బాబుని ఫాలో అవ్వకూడదని సూచిస్తున్నారంట టీడీపీ సీనియర్ నేతలు!
చంద్రబాబు.. టీడీపీ ఫౌండర్ నందమూరి తారక రామారావుని మోసం చేసి పార్టీని దక్కించుకున్నారనేది అంతా చెప్పే మాట. చంద్రబాబు ఖండించని మాట. ప్రపంచానికి తైల్సిన మాట! అయితే ఈ విషయంలో పార్టీ ఫౌండర్ నే మోసం చేయగలిగినంత నేర్పరితనం ఉన్న చంద్రబాబునే మోసం చేస్తున్నారంట టీడీపీ ఫండర్స్! అవును… పార్టీకి విరాళాలు ఇస్తున్నట్లు మహానాడు వేదిక మీద చాలా మంది ప్రకటిస్తుంటారని, తర్వాత మాయమైపోతారని ఫీలవుతున్నారు చంద్రబాబు.
తాజాగా ఈ విషయాలపై ఓపెన్ అయిన చంద్రబాబు… పలు సందర్భాల్లో పార్టీ వేదికల మీద నుండి లక్షల రూపాయలు విరాళాలు ప్రకటించిన తముళ్లు.. మళ్ళీ అడ్రస్ లేకుండా పోతున్నారని మండిపడుతున్నారు. కేవలం పేరు, మీడియాలో ప్రచారం కోసమే విరాళాలు ప్రకటించేవాళ్ళు చాలామంది ఉన్నారని.. అలాంటి వారికి చెక్ పెట్టడంకోసమే తాను కొత్తగా విరాళాల కోసం ఆన్ లైన్ విధానాన్ని తీసుకొచ్చానని స్పష్టం చేశారు. ఇకపై విరాళాలు ఇవ్వదలచుకున్న వారంతా నిజాయితీగా ఆన్ లైన్లో పేమెంట్ చేయాలని సూచించారు.
దీని వెనుక బాబుకు చాలా చేదు జ్ఞాపకాలే ఉన్నాయని తెలుస్తుంది. గత మహానాడులో కొంతమంది కార్యకర్తలు, నాయకులు… పాతిక లక్షలు, యాబై లక్షలు విరాళాలు ప్రకటించారట. దీంతో టీడీపీ అనుకూల పత్రికలు, సోషల్ మీడియా గ్రూపులూ వారిని పైకి లేపాయి. మహానాడులో కూడా బాబు వారిని ప్రత్యేకంగా అభినందించారు. అయితే మహానాడు అయిపోయిన తర్వాత ఆ బ్యాచ్ మొత్తం మాయం అయిపోయిందంట. దీంతో షాక్ తిన్న చంద్రబాబు… దీనికి సరైన పరిష్కారం కనుక్కోవాలని.. ఈ మహానాడులో ఆన్ లైన్ విధానాన్ని తెరపైకి తెచ్చారంట.
దీంతో… ఫౌండర్ ని మోసం చేసిన చంద్రబాబునే మోసం చేస్తున్నా ఫండర్స్ అంటూ కామెంట్లు వెలుస్తున్నాయి! ఏది ఏమైనా… ఈ పరిస్థితి ఏ పార్టీ అధ్యక్షుడికీ రాకూడదని ఫీలవుతున్నారు చంద్రబాబు అభిమానులు!