ఎవడబ్బ సొమ్మని కులికేవు రామ “చంద్ర”

 
 
-జ్యోతిశ్రీ
 
పోలవరం ప్రచారానికి రు. 400 కోట్లు వృథా .
 
భక్త రామదాసుగా పిలవబడుతున్న కంచర్ల గోపన్న శ్రీ రామునికి పరమ భక్తుడు. వీర విధేయత కలిగిన సాత్వికుడు.గోల్కొండ నవాబు తానీషా వద్ద తహశీల్దారు ఉద్యోగం చేస్తూ ప్రజల నుండి వసూలు చేసిన సొమ్మును ప్రభువుకు చెల్లించాల్సి ఉండగా శ్రీ రాముణ్ని మీద భక్తి తో భద్రాచలంలో ఆలయం నిర్మించడమే కాకుండా శ్రీ రామునికి ఆయన దేవేరికి బంగారం ఆభరణాలు చేయించి తుదకు జైలు పాలైన కథ తెలుగు ప్రజలకు బాగా తెలుసు.
 
జైలు శిక్ష అనుభవిస్తున్న గోపన్న శ్రీ రాముడు తనను కాపాడుతాడని మూఢ భక్తితో జైలు నుండి ఎంత వేడుకున్నా ఫలితం లేక పోగా తను ఎంతో ఘాఢంగా ఆరాధించే శ్రీ రామ చంద్రున్నికడుపు మండి ఎవడబ్బ సొమ్మని కులికేవు రామ చంద్రా అని భక్తి గీతం పాడుతూ నిలదీసిన కథ కూడా అందరికీ తెలుసు. అంతేకాదు-రామ చంద్రుని దేవేరికి చేయించిన ఆభరణాలు గురించి చెబుతూ “సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకం” అని దెప్పి పొడిచిన కథనం తెలుగు ప్రజలకు బాగా తెలుసు. ముందు వెనుక చూచు కోకుండా నవాబుకు చెంద వలసిన ధనం ఖర్చు చేసిన రామ దాసు తుదకు శ్రీ రాముడునే నిలదీశారు.ఆలాంటి భక్తాగ్రేసరుడేఒక దశలోతాను నమ్మిన దైవానికి ఎదురు తిరిగి నపుడు సాధారణ మానవ మాత్రుల స్పందన ఏలా వుంటుందో ఊహించ గలం. 
 
ఇంత కథ ఎందుకు చెప్పాలసి వస్తున్న దంటే 2014 ఎన్నికల్లో చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు అధికారం కట్ట బెట్టారు. నమ్మినాన బోస్తే పుచ్చి బుర్ర లైనట్లు ఆశలు కల్ల లైనవి. . 
ఎన్నికలు సందర్భంగా చేసిన వాగ్దానాలు నెరవేర్చ లేదు. పైగా సరి కొత్త మోసపు హామీలు గుప్పించు తున్నారు. పలు జిమ్మిక్కులు చేస్తున్నారు. అంత వరకైతే ఫర్వా లేదు. కాగా నిధులు లేవని చెబుతూనే వివిధ రకాల ప్రచారాలకు కోట్లాది నిధులు మంచి నీళ్లు లాగా వ్యయం చేస్తున్నారు. తన ఆరాధ్యదైవమైన శ్రీ రాముడుని గోపన్న నిలదీసిట్లు ఎంతో అభిమానంతో ముఖ్యమంత్రిపదవి కట్ట బెట్టిన రాష్ట్ర ప్రజలు నిలదీశే రోజు రానున్నది. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకపక్క కేంద్రం నిధులు ఇవ్వడం లేదని గోల చేస్తున్నారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సకాలంలో నిధులు ఇచ్చి వుంటే ఈ పాటికే పూర్తి అయ్యేదని రోజు టముకు వేస్తున్నారు. మరోవైపు ప్రజల రక్తం స్వేదం నుండి పిండుతున్న నిధులను కోట్లాది
రూపాయలు ఉత్పత్తేతర రంగంలో ప్రచారాలకు దుబారా చేస్తున్నారు.
 
ప్రస్తుతం అసలు కధ ఏమంటే పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రాష్ట్రం మొత్తంనుండి రెండు
 లక్షల మందిని తరలించేందుకు ఇతర అనవసర ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నట్లు ఒక ఇంగ్లీషు పత్రిక కథనం వండి వార్చింది. వెను వెంటనే ఒక తెలుగు దిన పత్రిక జీవోలతో సహా వెల్ల డించింది. అంతటితో ఆగలేదు. ఈ సమాచారం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ 400 కోట్ల రూపాయల వ్యయం చేసి వుంటే గొతెండి పోతున్న రాయలసీమలో అసమగ్రంగా వున్న కనీసం రెండు ప్రాజెక్టులు నిర్మాణం పూర్తి అయ్యేవని కూడా నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు పైగా రాష్ట్ర రాజధాని విజయవాడలో ఫ్లై ఓవర్ వంతెనకు రాష్ట్ర వాటా 90 కోట్ల రూపాయలు మంజూరు చేసి వుంటే ఈ పాటికే వంతెన నిర్మాణం పూర్తయి వుండేది తెలుగు దినపత్రిక నిలదీసింది
 
 ఇంగ్లీషు మీడియా కథనం మేరకు జీవో నెంబరు1709 మేరకు రు. 23 కోట్ల 16 లక్షలు :జీవోనెంబరు 311 ప్రకారం 22 కోట్ల 25 లక్షలు :జీవో నెంబరు211 ప్రకారం 23 కోట్ల 35 లక్షలు :జీవో 1226 మేరకు89కోట్ల 60 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది.
 
ఒక్కో సందర్శకుని పై రు. 375 వ్యయం చేశారు. ఈ ఖర్చు కాకుండా ఒక్కో బస్సుకు రు. 55 వేలు చొప్పున అదనపు భారం పడింది.కిలో మీటరుకు రు. 66 రూపాయలు అద్దె చెల్లిస్తున్నారు . ఇవి కాకుండా మరొక 15 జీవోలు జారీ చేస్తూ మొత్తం దాదాపు రు. 400 లూటీ చేశారని ఇందుకోసమే ముఖ్యమంత్రి కేంద్రంతో పోట్లాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం భాధ్యత తన చేతుల్లోకి తీసుకొన్నట్ల తెలుగు దిన పత్రిక రాసింది.
ఇవన్నీ అటుంచి తాజాగా సంభవించుతున్న పరిణామాలు పోలవరం ప్రాజెక్టు భద్రత పై కూడా అనుమానాలు వెల్లు వెత్తు తున్నాయి.
 
ఆ మధ్య పోలవరం ప్రాజెక్టు వద్ద రోడ్డు నెర్రేలు పారడం జరిగింది. తిరిగి తాజాగా ప్రధాన మైన రోడ్డు పగిలి పోవడంతో అంతిమంగా ప్రాజెక్టు నిర్మాణం నాణ్యత పై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత నీరు నింపిన తర్వాత గాని అనుభవంలోనికి రాదని సంభవించు సంఘటనలు పలు అనుమానాలకు దారి తీస్తోంది.