ట్రైలర్ టాక్ : ఈసారి “జవాన్” తో షారుక్ అంతకుమించిన దండయాత్ర 

గత కొన్నాళ్ల నుంచి భారీ నష్టాల్లో ఉన్న సినీ ఇండస్ట్రీ ఇండియా నుంచి ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం డెఫినెట్ గా బాలీవుడ్ సినిమానే అని చెప్పాలి. మరి మళ్ళీ పూర్వ వైభవం ఎప్పుడు భారీ లాంగ్ రన్ లు ఎప్పుడు వస్తాయి అనే సమయంలో వచ్చిన చిత్రమే “పఠాన్”.

కంటెంట్ యావరేజ్ కావచ్చు కానీ హీరో మామూలోడు కాదు అందుకే కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ పేరిట ఏకంగా ఈ యావరేజ్ కంటెంట్ తో కూడా 1000 కోట్ల వసూళ్లు వచ్చాయి. దీనితో బాలీవుడ్ బిగ్గెస్ట్ కం బ్యాక్ ని అందుకోగా ఇక ఈ సినిమా తర్వాత షారుక్ నుంచి వచ్చే ప్రత్ సినిమా కూడా ఇదే రేంజ్ లో ఆడుతాయి అనే నమ్మకం వచ్చేసింది.

దీనితో నెక్స్ట్ లైన్ లో ఉన్న రిలీజ్ చిత్రం “జవాన్” కోసం అంతా ఎగ్జైటింగ్ గా ఎదురు చూడడం స్టార్ట్ చేశారు. కాగా ఈ చిత్రాన్ని తమిళ యంగ్దర్శకుడు అట్లీ తెరకెక్కించగా ఇప్పుడు దీని నుంచి రిలీజ్ ట్రైలర్ వచ్చింది. ఇది మాత్రం ఓవరాల్ పఠాన్ కి ఎన్నో రెట్లు మించి బెటర్ గా ఉందని చెప్పవచ్చు.

అందులో యావరేజ్ కంటెంట్ లానే ఉన్నప్పటికీ ఈ ట్రైలర్ లో అద్భుతమైన ఏక్షన్ ఎపిసోడ్స్ తో పాటుగా కదిలించే ఎమోషన్స్ దేశ భక్తి కామెడీ ఇలా అన్నిటికి అట్లీ పెట్టి కుమ్మేసాడు. వీటి అన్నిటికి షారుక్ టైమింగ్ మరియు స్టార్డం తోడైతే బాక్సాఫీస్ దగ్గర ఆకాశమే హద్దు. దీనితో ఈ సినిమా మాత్రం పఠాన్ కన్నా బిగ్ థింగ్ అయ్యేలా ఉంది.

పైగా విజయ్ సేతుపతి నయనతార లు బాలీవుడ్ నుంచి మరిన్ని ఆఫర్స్ అందుకున్నా ఆశ్చర్యం లేదు. ఇలా జవాన్ న్యూ ట్రైలర్ మాత్రం కరణ్ జోహార్ చెప్పినట్టుగా బాలీవుడ్ హిస్టరీలో ట్రైలర్ ఆఫ్ ది సెంచరీ అన్నట్టే ఉంది. కాగా ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా అది కూడా ఆల్రెడీ హిట్ అయ్యింది. అలాగే ఈ సెప్టెంబర్ 7న సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.