‘మయో సైటిస్’ వ్యాధి బారిన పడి ప్రస్తుతం సమంత ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. లాంగ్ గ్యాప్ తర్వాత ‘శాకుంతలం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కోసం సమంత హాజరైంది.
ఈ ఈవెంట్‌కి రావడానికి చాలా చాలా కష్టపడ్డానని సమంత చెప్పుకొచ్చింది. అవును నిజమే, స్టేజ్‌పై సమంత చాలా ఇబ్బందిగా ఫీలైంది. సఫొకేషన్ వచ్చేసిందామెకి. శ్వాస తీసుకోవడంలోనూ చాలా ఇబ్బందిగా కనిపించింది. చేతిలో జపమాల కనిపించింది. స్ర్టెస్ రిలీఫ్ కోసమే ఆ జపమాలను తనతో వుంచుకుంది సమంత.
అయితే, ప్రస్తుతానికి సమంత ఫిట్‌గానే కనిపించింది. కానీ, ఆమె బాడీ వర్కవుట్స్‌కి ఇంకా సహకరించడం లేదట. మరో ఆరు నెలలు పడుతుందట సమంత మామూలు మనిషి కావడానికి. ఆరు నెలల తర్వాత ఖచ్చితంగా వర్కవుట్స్ కూడా చేయగలనని సమంత ధీమా వ్యక్తం చేస్తోందట.
బరువులు ఎత్తడంలోనూ, వర్కవుట్స్ చేయడంలోనూ సమంత రికార్డులు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. కానీ, అదంతా గతం. జీవితం మునుపటిలా లేదు.. అంటూ మొన్నీ మధ్యనే సోషల్ మీడియా ద్వారా సమంత తెలిపిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ఆరు నెలల వరకూ సమంత కమిట్ అయిన ప్రాజెక్ట్ ‘ఖుషీ’ ఆగాల్సిందే.!