సినీ నటి సమంత ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతోందట.! అది కూడా, తెలంగాణ నుంచే ఆమె తన రాజకీయ ప్రయాణం ప్రారంభించబోతోందట.! వచ్చే ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి తరఫున, సమంత ఎన్నికల ప్రచారంలో కనిపించబోతోందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో సమంత, తెలంగాణలో నేతన్నలకి మద్దతుగా పలు కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవాన్ని కూడా అందుకుంది. తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ సమంత.. అని అప్పట్లో పెద్దయెత్తున ప్రచారం జరిగింది. ప్రచారం మాత్రమే కాదు, ఆ దిశగా ప్రభుత్వం తరఫు నుంచీ ఆమెకు ప్రోత్సాహం లభించింది.
కానీ, ఆ తర్వాత ఏమయ్యిందో.. సమంత, మళ్ళీ ఆ తరహాలో రాజకీయ వార్తల్లో కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు, తాజాగా ‘స్టార్ క్యాంపెయినర్’ అనే కోణంలో సమంత పేరు ప్రచారంలోకి వచ్చింది. ఈ విషయమై ఆరా తీస్తే, సమంత ఎలాంటి పొలిటికల్ కమిట్మెంట్స్ జోలికీ వెళ్ళడం లేదని తెలిసింది.
కానీ, ఎన్నికల ప్రచారంలోకి సమంతని తీసుకురావాలనే ప్రయత్నాలైతే గట్టిగానే జరుగుతున్నాయట. ఇంకా, ఎన్నికలపై ప్రకటన రాకపోయినా.. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్నికల హడావిడి అయితే రాజకీయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో సినీ స్టార్లకు ఆయా పార్టీలు గాలం వేయడం షురూ అయ్యింది కూడా.
తెలంగాణలో మాత్రమేనా.? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి సమంతకి ఆఫర్స్ ఏమీ రాలేదా.? అన్న కోణంలోనూ చర్చ జరుగుతోంది. తన ఆరోగ్య పరిస్థితుల