కిలో అంటే కోటి: బీఆర్ఎస్ లో “15 కిలోల నెయ్యి” టెన్షన్!

మ‌నీలాండ‌రింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ రాసిన లేఖ తాజాగా తెలంగాణ రాజకీయాలతో పాటు, దేశ రాజకీయాల్లోనూ సంచ‌ల‌నం రేపుతోంది. కేజ్రీవాల్ చెప్పిన‌ట్లు బీఆరెస్స్ కు రూ.75కోట్లు ఇచ్చిన‌ట్లు ఆ లేఖ‌లో ప్ర‌స్తావించారు. హైదరాబాద్ లోని బీఆరెస్స్ ఆఫీస్ ద‌గ్గ‌ర పార్క్ చేసిన వ్యక్తికి రూ.15కోట్లు ఇచ్చిన‌ట్లు పేర్కొన్నారు. ఫలితంగా.. సుఖేష్ చంద్రశేఖర్ రాసిన ఆ లేఖపై తెలంగాణ‌లో రాజ‌కీయాల్లో పెద్ద దుమారమే రేగుతోంది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ బాంబ్ పేల్చాడు సుఖేష్ చంద్రశేఖర్. ఈ క్రమంలో… బీఆరెస్స్, ఆప్ పార్టీలపై కీలక ఆరోపణలు చేశాడు. ఈ కేసులో వంద కోట్ల ముడుపులు చేతులు మారాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో 75 కోట్లకు సంబంధించిన గుట్టు విప్పాడు. అవును… మనీలాండరింగ్ కేసులో అరెస్టై తీహార్‌ జైల్లో ఉన్న సుఖేష్‌ మరో సంచలన లేఖను విడుదల చేశారు. తీహార్‌ జైలు నుంచి సుఖేష్‌ చంద్రశేఖర్‌ లేఖ రాశారు. కేజ్రీవాల్‌ తో తాను చేసిన వాట్సాప్ చాట్‌.. తనదగ్గర ఉన్నట్టు లేఖలో పేర్కొన్నారు.

కేజ్రీవాల్ చెప్పిన‌ట్లు బీఆరెస్స్ కు రూ.75 కోట్లు ఇచ్చిన‌ట్లు లేఖ‌లో ప్రస్తావించారు. రూ. 15 కోట్ల చొప్పున ఐదుసార్లు.. అంటే రూ.75కోట్లు ఇచ్చాన‌ని.. హైదరాబాద్ లోని బీఆరెస్స్ ఆఫీస్ దగ్గర పార్క్ చేసిన వ్యక్తికి రూ.15కోట్లు అందించానని చెప్పారు. దీంతో ఈ తాజా లేఖ సంచ‌ల‌నం రేపుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ తో తాను మొత్తం 700 పేజీల వాట్సాప్, టెలిగ్రాం చాట్‌ లు చేసినట్లుగా వెల్లడించిన సుఖేష్… తన దగ్గర వాటన్నింటికీ సంబంధించిన ఆధారాలు ఉన్నాయని.. త్వరలోనే వాటిని బయటపెడుతా అంటూ బాంబ్ పేల్చారు.

ఇదే సమయంలో… “కేజ్రీవాల్ జీ, నేను 2020కి సంబంధించిన చాట్ ట్రైలర్‌ ను చూపించబోతున్నాను. అందులో మీరు, మిస్టర్ జైన్ సెట్ చేసిన 15 కిలోల నెయ్యి కోడ్, నేను వ్యక్తిగతంగా డెలివరీ చేశాను. అంటే.. మీ తరపున 15 కోట్ల రూపాయలు చెల్లించాను. రాజకీయ కార్యాలయం, టీఆరెస్స్ పార్టీ కార్యాలయంలో మద్యం కేసు నిందితుల్లో ఒకరికి” అని ప్రకటన విడుదల చేశారు సుఖేష్.

కాగా… రూ.200 కోట్ల హవాలా కేసులో ఆరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న సుఖేష్… జైలు బయట ఎంత విలాసవంతమైన జీవితం అనుభవించాడో, జైలు గోడల మధ్య కూడా అదే లగ్జరీని అనుభవిస్తున్నాడు. అత‌ని జైలు గదిని అకస్మాత్తుగా తనిఖీ చేసిన అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. అందులో సుఖేష్ వాడే చెప్పుల విలువే లక్షన్నర రూపాయలు కాగా.. అతడి మూడు ప్యాంట్ల విలువ సుమారు 88 వేలంట!

Sukesh Chandrasekhar Letter | కేజ్రీవాల్ టార్గెట్‌గా సుఖేశ్‌ చంద్రశేఖర్ సంచలన లేఖ | 10TV