ఇంతకీ ఏ ‘శెట్టి’కి రష్మిక మండన్న క్షమాపణ చెప్పింది.? కన్నడ సినీ పరిశ్రమలో తనపై ‘వేటు’ పడిన దరిమిలా, డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు సిద్ధమైంది కన్నడ కస్తూరి రష్మిక మండన్న. రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి తనకు ఒకప్పుడు అండగా వున్నారంటూ తాజాగా రష్మిక సెలవిచ్చిన సంగతి తెలిసిందే.
పూర్తిగా కన్నడ సినీ పరిశ్రమను వదిలేసి, హిందీ సినీ పరిశ్రమతోపాటు తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో మాత్రమే తిరుగుతున్న రష్మికకి, కన్నడ సినీ అభిమానులు పెద్ద షాక్ ఇచ్చారు.
పైగా, రష్మిక కూడా తనకు లైఫ్ ఇచ్చిన రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిల గురించి ఆ మధ్య నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం ఇంకా పెరిగింది. దాంతో, రష్మిక డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగక తప్పలేదు.
తాజాగా ఓ ‘శెట్టి’తో రష్మిక మాట్లాడే ప్రయత్నం చేసిందట. తనను క్షమించాలని కూడా కోరిందట. వీలైతే, ఆ శెట్టి సినిమాలో నటించడానికీ సిద్ధమేనని చెప్పిందట. అది కూడా రెమ్యునరేషన్ గొడవ లేకుండా చేస్తానందట. ‘ఏం అవసరం లేదు’ అని అట్నుంచి రిప్లయ్ వచ్చిందట. ఇంతకీ, ఏ శెట్టికి రష్మిక సారీ చెప్పింది.? రిషబ్ శెట్టికా.? రక్షిత్ శెట్టికా.?