Droupadi Murmu: స్టేజ్ మీదే కన్నీరు పెట్టుకున్న.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..!

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా దేశం నలుమూలల నుంచి శుభాకాంక్షల వెల్లువెత్తాయి. నాయకులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఇక రాష్ట్రపతి పుట్టిన రోజు సందర్భంగా ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ చిన్న సంఘటన దేశ ప్రజల హృదయాలను తాకింది.

డెహ్రాడూన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజిబుల్ డిజెబిలిటీస్‌ వద్ద ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. అక్కడ అంధ విద్యార్థులు ఆమె పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన పాటను ఆలపించారు. సంగీతంతో కాదు… గుండెల్లోంచి వచ్చిన ఆ భావోద్వేగంతో ఆలపించి ఆ గీతం.. ముర్ము మనసుని తాకింది. ఆ పాట వినగానే ఆమె కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఆ చిన్నారుల ప్రేమకు, వారి భావోద్వేగానికి ఆమె చలించిపోయారు.

కేవలం పుట్టినరోజు వేడుక కాదు.. రాష్ట్రపతి తమ చేతులమీదుగా అంధ విద్యార్థులకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు చూపిన ప్రేమాభిమానాలు, స్వచ్ఛమైన శుభాకాంక్షలు ముర్ము గారికి గుండెను తాకాయి.

ఈ మధుర ఘట్టానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రపతిని అలా భావోద్వేగంతో చూడడం అనేది అరుదైన దృశ్యం. ఆమె నిజమైన మానవత్వాన్ని ప్రతిబింబించిందని, ఇది ఓ అందమైన క్షణమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. “ప్యూర్ హార్ట్”, “రియల్ ఇమోషన్”, “టచ్‌డ్ మై సోల్” వంటి పదాలతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.