మారుతి దర్శకత్వలో ప్రభాస్.! డౌట్లెందుకు బాస్.!

భారీ సినిమాలు ముందరేసుకుని, ఓ చిన్న సినిమాని.. అది కూడా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఎందుకు కమిట్ అయినట్లు.? ఇదొక మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘మారుతితో సినిమా చేయొద్దు..’ అంటూ ప్రభాస్ అభిమానులు నెత్తీనోరూ కొట్టుకున్నారు. కానీ, ప్రభాస్ వినలేదు.

సినిమా షూటింగ్ ప్రారంభమవడం, కొన్ని రోజులు షూటింగ్ జరగడం.. ఇదంతా ఇప్పటికీ ప్రభాస్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారికంగా అయితే, ఈ సినిమా నుంచి అప్డేట్స్ పెద్దగా రావట్లేదు.

ఇంకోపక్క, ‘ఆదిపురుష్’ ఇంకా ఆలస్యమయ్యేలా వుందన్న గాసిప్, ప్రభాస్ అభిమానుల్ని మరింత బాధపెడుతోంది. ప్రభాస్ ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ సినిమాల మీద ఫోకస్ పెట్టకుండా మారుతి సినిమాకి అతుక్కుపోయాడేంటన్నది వాళ్ళ ఆవేదన.

‘అబ్బే, ప్రభాస్ – మారుతి సినిమా గురించి పెద్దగా మాట్లాడుకోడానికి లేదు.. అది వర్కవుటయ్యేది కాదు..’ అంటూ ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. మరీ, అంతలా ప్రభాస్ ఎందుకు మారుతిని ఇరుకున పడేస్తాడు.? ఎక్కడో ఏదో తేడా కొడుతోంది. కానీ, నిప్పు లేకుండా అయితే పొగ బయటకు రాదు కదా.?