బండి సంజయ్ ని వాయించి వదిలిని పేర్ని నాని… బాబు కోటా బాబుదే!

గతకొన్ని రోజులుగా ఏపీలోని నకిలీ ఓటర్లపై అధికార వైసీపీ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతీ నియోజకవర్గంలోనూ దొంగ ఓటర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే కుప్పంలో అలాంటి వారిని గుర్తించిన ప్రభుత్వ పెద్దలు… ప్రతీ నియోజకవర్గంలోనూ అలాంటి బ్యాచ్ ఉందని, వారిని తొలగించాలని కోరుతున్నారు.

ఈ క్రమంలో ఏపీలో దొంగఓట్లు తొలగించాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుంటే… లేదు లేదు ఏపీలో నియోజకవర్గానికి 10 నుంచి 20 వేల దొంగ ఓటర్లను చేర్చుతున్నారంటూ బండి సంజయ్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పేర్ని నాని… తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ఇది బీజేపీ కాదు.. వైసీపీ అని తెలిపారు.

ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఎన్నికల కమిషన్ ని కలిసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని.. బండి సంజయ్ వ్యాఖ్యలపైనా, చంరబాబుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు చేస్తోందంటూ బండి సంజయ్ చేసిన ఆరోపణలను పేర్ని నాని తప్పు పట్టారు. ఉత్తర భారతదేశంలో భారతీయ జనతాపార్టీ చేసినట్లు అందరూ చేస్తారనుకుంటే పొరపాటని హితవు పలికారు.

పక్క రాష్ట్రంలో పదవి పోయినవాడు ఒకడు వచ్చి ఏపీలో ఓటర్ల జాబితా అక్రమాలపై మాట్లాడుతున్నాడు అంటూ బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పేర్ని నాని. ఉత్తర భారతంలో భారతీయ జనతాపార్టీ చేసినట్లుగా ఇక్కడ వైసీపీ కూడా చేస్తుందని అనుకుంటే పొరపాటని తెలిపారు. ఇలా ఏదిబడితే అది మాట్లాడతున్నాడనే ఎన్నికల వేళ పదవి ఊడిపోయిందని ఎద్దేవా చేశారు.

ఇదే సమయంలో టిడిపి చేసిన పాపాల వల్ల ఇప్పుడు ఏపీలో భారీగా నకిలీ ఓటర్లు ఉన్నారని ఆరోపించిన పేర్ని నాని… ఓటర్ల జాబితా విషయంలో పాపాలు చేసింది చంద్రబాబు మాత్రమే అని అన్నారు. దొంగ ఓటర్లను చేర్చి గెలవాలనుకునే ఆలోచన చంద్రబాబుకు మాత్రమే వస్తుందని.. ఆవు తోలు కప్పుకున్న నక్కలా చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నాడని నానీ మండిపడ్డారు!

కాగా… రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాతో వైసీపీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, అనిల్ కుమార్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ భేటీ అయ్యారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. డూప్లికేట్ ఓటర్లు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.