పవన్ కళ్యాణ్ హిందూ పరిరక్షుడిగా ఎందుకు మారారు?

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో విశేష అభిమానగణం కలిగిన సినిమా స్టార్. వెండితెరపై పవర్ స్టార్ అనే బిరుదకి నూటికి నూరుపాళ్లు నిజం చేసిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాల సంవత్సరాలుగా వున్నా ఎందుకో కనీసం తొలి మెట్టు ఎక్కలేకపోయారు. సరే రాజకీయాల్లో సినిమా తారలు విఫలమవడం కొత్తేమి కాదు. పక్క రాష్ట్రం తమిళనాడులో విజయ్ కాంత్ పార్టీ పెట్టారు. మొదటి ఎన్నికల్లో కేవలం తాను ఒక్కడే గెలిచాడు. మలి ఎన్నికల్లో 27 సీట్లు సాధించారు, ఆ తర్వాత ఒక్క సీటు కూడా రాలేదు. అయితే విజయ్ కాంత్ తన పంథాలో తాను రాజకీయం చేసుకుంటూపోయాడు. అతను ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత ప్రజలు విజయ్ కాంత్ పట్ల సానుభూతి చూపించారు కానీ గేలి చెయ్యలేదు. అలాగే తాను రోజుకొక మాట మాట్లాడలేదు.

Pawan Kalyan

విజయ్ కాంత్ లాగే పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో జనసేన అనే పార్టీ ని స్థాపించారు. మొదటి ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా తెలుగుదేశం కు మద్దతు తెలిపారు. అంతవరకు బాగానే వుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందనే అతని అభిప్రాయాన్ని ఎవ్వరు కాదనలేరు. అయితే మొన్న 2019 ఎన్నికల్లో మాత్రం తొలిసారి జనసేన తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పెట్టారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాకూడదని పవన్ కళ్యాణ్ కు ఎందుకో మొదటినుండి వుంది. అందుకే 2019 ఎన్నికల్లో జగన్ ని ఓడించాలంటే దళిత వర్గాలు మరియు క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు జగన్ కు దూరం చేస్తే సరిపోతుందని అనుకున్నారో ఏమో, మాయావతితో పొత్తు పెట్టుకున్నారు. అలాగే క్రిస్టియన్ ఓట్లు దూరం చెయ్యడానికి తన సొంత వ్యవహారమే బయటకు తీశారు. తాను చిన్నప్పుడు ఒక స్నేహితుడు ద్వారా బాప్టిజం తీసుకున్నాని, తన భార్య ఆర్థోడాక్స్ క్రిస్టియన్ అని తన పిల్లలు క్రిస్టియన్ మతం పాటిస్తారని చెప్పుకొచ్చారు. తనలో నరనరాన క్రిస్టియన్ భావాలూ ఉన్నాయని, క్రైస్తవమే మనుషులకి సేవ భావం నేర్పిందని కూడా చెప్పుకొచ్చారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి అసలు మతఘర్షణలు వచ్చేదే హిందువుల వల్ల అని కూడా చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రసంగాలు వింటే ఇతను పవన్ కళ్యాణా లేకుంటే క్రైస్తవ కళ్యాణా అన్నట్టు ఉండేది. సరే ఆయనకు నిజంగానే ఆ బావాలున్నాయని సరిపెట్టుకోవచ్చు.

కానీ ఆరు నెల్లలోవ్యవహారం పూర్తిగా రివర్స్ అయ్యింది. ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమి తర్వాత, పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అయ్యింది. ఈ సారి జగన్ ను ఓడించాలంటే మైనార్టీలు, ఎస్సీ ఎస్టీ లు దూరం చెయ్యడం కాదు మెజారిటీ హిందువులని దూరం చెయ్యాలని నిర్ణయించుకున్నారేమో, ఓడిపోయినప్పటి నుండి బీజేపీ తో పొత్తు కు ప్రయత్నించారు . అందులో సఫలీకృతం అయ్యారు. పొత్తు కుదిరిన వెంటనే తనలోని క్రిస్టియన్ భావాలూ ఎటుపోయ్యాయో ఎవరికీ అంతుబట్టడం లేదు. సనాతన ధర్మాన్ని కాపాడడానికి పుట్టిన కారణజన్ముడులాగా తయారయ్యారు. తన ట్విట్టర్ అకౌంటంతా హైందవ ధర్మం తో నింపేశారు. ఎంతగా అంటే మొన్న ప్రధానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడంలో కూడా సనాతన ధర్మం ప్రతిబింభించేంతగా. ఉన్నపళంగా ఇంత మార్పుకు దారితీసిన కారణాలేంటో ఆ దేవుడికే తెలియాలి.

Pawan Kalyan
Pawan kalyan new avatar

రాజకీయాల మీద ఏమాత్రం అవగాహన వున్నవారికి ఈ మార్పు వెనుక కారణం స్పష్టంగా తెలుస్తుంది. ఇది కేవలం వైయస్ జగన్ ని ఓడగొట్టడానికి అనేది స్పష్టం. ఒక రాజకీయ పార్టీ గా ప్రత్యర్థిని ఓడించడానికి మీరు ప్రయత్నించాలి. అయితే ఇలా యూటర్న్ తీసుకొని, మీ భావజాలాన్ని ప్రతి ఎన్నికల్లో మార్చుకోనైతే మాత్రం కాదు. జగన్ ను ఓడగొట్టాలంటే మీరు జగన్ కంటే ఎక్కువ కష్టపడాలి. జగన్ కంటే ఉన్నతంగా రాజకీయాలు చెయ్యాలి. ప్రజల్లో మీకు అధికారం కల్పించాలనే ఒక కోరిక పుట్టించాలి. అంతే గాని కుల మతాలు ప్రకారం కూడికలు తీసివేతలు వేసే రాజకీయాలు చేస్తే ఆ రాజకీయాల్ని ప్రజలు హర్షించరు. అన్ని కులాలు మతాల్లో మీకు సానుకూలత ఏర్పడి అందరూ ఓట్లు వేస్తేనే మీరు గెలుస్తారు. లేదు జగన్ మీద కక్షపూరిత రాజకీయమే చేస్తామంటే 2024 జనసేనకు చివరి ఎన్నికలవుతాయి.