కేంద్ర మంత్రిగా పవన్ కళ్యాణ్.! ఇది ఎన్నోసారి.?

ఔనా, పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అవబోతున్నారా.? మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ నుంచి ఆయనకు ఆ ఆఫర్ వచ్చిన మాట వాస్తవమేనా.?
గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల్లో ఈ విషయమై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలోనే, పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అవుతారన్న ప్రచారం జరిగింది. అప్పటినుంచ ఇప్పటిదాకా తరచూ ఈ తరహా గాసిప్స్ వస్తూనే వున్నాయి.

‘బీజేపీ నుంచి అలాంటి ప్రతిపాదనలు వస్తున్న మాట వాస్తవం. కానీ, రాష్ట్ర రాజకీయాలకే పవన్ కళ్యాణ్ పరిమితమవ్వాలనుకుంటున్నారు..’ అంటూ కొందరు జనసేన నేతలు వ్యాఖ్యానించడం కూడా చూశాం. అయితే, ఈసారి ఇంకాస్త గట్టిగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి అవుతారన్న ఊహాగానాలు షికార్లు చేసేస్తున్నాయి.

త్వరలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకర్ని, తెలంగాణ నుంచి ఒకర్ని కొత్తగా కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకోనున్నారట. ఏపీ నుంచి పలువురు బీజేపీ నేతలు రేసులో వున్నా, 2024 ఎన్నికల్లో రాజకీయ లబ్ది కలగాలంటే.. అదీ జనసేన ద్వారా బీజేపీకి మేలు జరగాలంటే.. పవన్ కళ్యాణ్‌ని కేంద్ర మంత్రిని చేయాల్సి వుంటుంది.

అంటే, రాజ్యసభకి పవన్ కళ్యాణ్ ఎన్నికవ్వాలి. అది బీజేపీ చేతుల్లో పని. రాజ్యసభ సభ్యత్వం వస్తే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎలా అవుతారు.? నిజానికి, అంత సీజణ్ బీజేపీ, పవన్ కళ్యాణ్‌కి ఇవ్వకపోవచ్చు. అసలు పవన్ కళ్యాణ్‌ని బీజేపీ లెక్క చేయడంలేదన్న వాదన వుంది మరి.!