Adipurush : గాసిప్స్ : ప్రభాస్ “ఆదిపురుష్”ని కని వినీ ఎరుగని స్థాయిలో విడుదల చేయబోతున్నారా?

Adipurush : ప్రస్తుత ఇండియా బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్ డేట్స్ దొరికితే చాలు రోజుకి ఎన్ని కోట్లు అయినా ఇచ్చేందుకు ఎంతోమంది బడా బాలీవుడ్ నిర్మాతలు రెడీగా ఉన్నారు. అయినా ప్రభాస్ డేట్ ఇప్పుడు కష్టం గానే ఉంది. అయితే కాస్త ముందే బాలీవుడ్ లో స్టార్ దర్శకుడు ప్రభాస్ ని తన సినిమాకి గాను లాక్ చేసేసాడు. ఆ దర్శకుడే ఓం రౌత్, అలాగే తాను చేసిన సినిమానే “ఆదిపురుష్”.

రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ మొట్టమొదటి సారిగా రాముని పాత్రలో కనిపించనున్నాడు. అయితే మరి ఆల్రెడీ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యిపోగా ఇప్పుడు దర్శకుడు మరియు బృందం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఊహించని గాసిప్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది.

ఈ సినిమాని మాత్రం ప్రభాస్ కెరీర్ లోనే ఏ సినిమా కూడా రిలీజ్ చెయ్యని విధంగా కనీ వినీ ఎరుగని స్థాయిలో రిలీజ్ చెయ్యబోతున్నారట. అంటే ఈ సినిమాని ఏకంగా 20 వేల థియేటర్స్ లో రిలీజ్ చెయ్యడమే కాకుండా 10 భాషల్లో విడుదలకు ఇప్పుడు నుంచి ప్లాన్ లు గీస్తున్నారట. ఇది బాలీవుడ్ వర్గాల్లో రీసెంట్ స్టార్ట్ అయ్యిన టాక్. ఇదేగాని నిజం అయితే వేరె లెవెల్లో ఉంటుంది. ఇక ఈ భారీ సినిమాలో సీతగా కృతి సనన్ హీరోయిన్ గా నటించగా రావణ పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించాడు.