నాగ్ కే చెల్లింది:డైరక్టర్ పై  అప్పుడు విమర్శలు..ఇప్పుడు పొగడ్తలు

నాగార్జున ఆ మధ్యన తన తాజా చిత్రం దేవదాస్ డైరక్టర్ ని లేజీ ఫెలో అని, సినిమా రిలీజ్ కు ఒక రోజు ముందే సినిమా చూపించాడని కోపం వెళ్లగక్కారు. అయితే ఈ రోజున సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉండి నిలబడటంతో తన మాటలను వెనక్కి తీసుకున్నారు. నాగార్జున, నాని హీరోలుగా అశ్వినీదత్‌ నిర్మించిన చిత్రం ‘దేవదాస్‌’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. బుధవారం సక్సెస్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ దర్శకుడుపై ప్రశంసల వర్షం కురిపించారు.

నాగార్జున మాట్లాడుతూ…‘‘నటులకు చాలా అహం ఉంటుంది. అది  పుట్టుకతో వచ్చిన హక్కు అనుకుంటాం. అందుకే అప్పుడప్పుడు కాస్త కఠినంగా  ప్రవర్తిస్తాం. వాటన్నింటినీ తట్టుకుని శ్రీరామ్‌ ఆదిత్య మంచి సినిమా అందించాడు. తను భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తీస్తాడుు.నేను అప్పుడప్పుడూ కోపం తెచ్చుకున్నా, తట్టుకుని, ఎక్కడా బెణకకుండా సినిమా తీశాడు శ్రీరామ్‌ ఆదిత్య. తొలిసారి తనని చూసినప్పుడు ఇంత చిన్న కుర్రాడికి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ అప్పగించారా? అనిపించింది. కానీ తను నిరూపించుకున్నాడ’’అన్నారు నాగార్జున.

నాని మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ముందు నాగ్‌సార్‌ని చూస్తే.. ‘శివ’ గుర్తొచ్చేది. ఇకపై జీవితాంతం ‘దేవ’ గుర్తొస్తాడు. మౌత్‌టాక్‌తో మా సినిమా స్టడీగా
ఆడుతోంది’’ అన్నారు.