ట్విట్టర్ ని బెదిరించిన మోడీ… వీడియో వైరల్!

కర్ణాటక ఎన్నికల ఫలితాల దగ్గరనుంచి మోడీ & కో కి వరుస బ్యాడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. ఒకపక్క బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతుండగా.. మరోపక్క విపక్షాలు ఐక్యతారాగం వినిపిస్తున్నాయి. నిన్నమొన్నటివరకూ తెలంగాణలో కూడా ఆశలు పెట్టుకున్నా.. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ ఓవర్ టేక్ చేస్తున్న పరిస్థితి! ఈ నేపథ్యంలో ట్విట్టర్ నుంచి మోడీకి ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది!

తాజాగా ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సీ.. మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. తాజాగా ఒక చర్చాకార్య క్రమంలో పాల్గొన్న ఆయన… ట్విట్టర్ ను మోడీ ఎలా బెదిరంచారు, ఎలా అదిరించారు, ఎలా బ్లాక్ మెయిల్ చేయాలని చూశారు వంటి విషయాలపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

రైతుల నిరసనలు, ప్రభుత్వాన్ని విమర్శించే ఖాతాలను బ్లాక్ చేయమని ట్విట్టర్ పై మోడీ ప్రభుత్వం ఒత్తిడి చేసిందని జాక్ డోర్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా… ట్విట్టర్ ఇండియా ఉద్యోగులపై దాడి చేసి అరెస్టు చేస్తామని బెదిరించిందని డోర్సీ పేర్కొన్నారు. ఇదే క్రమంలో… ట్విట్టర్ ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేస్తామని.. ఆ తర్వాత ట్విట్టర్ కార్యాలయాలను మూసివేస్తామని ప్రభుత్వం హెచ్చరించిందని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం ఆన్ లైన్ వేదికగా ఈ వ్యాఖ్యలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా విడుదలయిన వీడియో ఒకెత్తు అయితే… ఆ వీడీయో కింద నెటిజన్లు పెడుతున్న కామెంట్స్ వరోకెత్తు అన్నట్లుగా సాగుతున్నాయి. మరి ఈ వ్యవహారంపై మోడీ ఎలా స్పందిస్తారు.. బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాలి!