మెగా వారసురాలు నిహారిక పెళ్లి వార్త నిన్నటి నుంచి సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. కాఫీ కప్ పై మిస్ కు బధులుగా మిసెస్ నిహారిక అని ఉండటంతో విషయం తెరపైకి వచ్చింది. తొలుత ఈ కాఫీ కప్ ను నిహారిక నటించే కొత్త సినిమా ప్రమోషన్ అయి ఉంటుందని భావించారు. ఆ తర్వాత కాసేపటికి కాబోయే వాడిని హత్తుకుని ఉన్న మరో ఫోటోని నిహారిక రివీల్ చేసింది. అయితే అతని ముఖం చూపించకుండా సస్పెన్స్ లో పెట్టింది. దీంతో ఆ కుర్రాడు ఎలా ఉంటాడు? నేపథ్యం ఏంటి? మెగా ఫ్యామిలీ ఇంట అల్లుడు! అయ్యే ఆ లక్కీగయ్ ఎవరంటూ? సోషల్ మీడియాలో ఒకేట చర్చ. తాజాగా ఆ వివరాలు కూడా బయటకు వచ్చాయి.
ఆ కుర్రాడు గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకరరావు కుమారుడు చైతన్య గా తెలుస్తోంది. బిట్స్ పిలానీ స్టూడెంట్. ప్రస్తుతం టెక్ మహీంద్రలో ఉన్నత స్థానంలో ఉన్నాడు. నిహారిక-చైతన్యది పెద్దల కుదిర్చిన పెళ్లి. కొన్ని నెలలుగా ఇరు కుటుంబాల మధ్య పెళ్లి మాటలు జరుగుతున్నాయట. చివరికి అన్నీ కుదరగానే నిహారిక తన హబ్బీని అలా మెగా ప్రేక్షకాభిమానులకు పరిచయం చేసింది. దీనిపై అధికారిక ప్రకటన ఆషాడ మాసం ముందుగానే వచ్చే అవకాశం ఉంది. చైతన్య చూడటానికి హీరోలాగే ఉన్నాడు. ఒడ్డు పొడవు..రంగు హీరోయిక్ లుక్ ఏ మాత్రం తక్కువ కాకుండా ఉన్నాడు. కాబట్టి టాలీవుడ్ లో లాంచ్ అయినా ఆశ్చర్యపోనస రం లేదు. ఇప్పటికే ఆ రకంగా అభిమానుల పోస్టులు వేడెక్కిస్తున్నాయి.
మరి ఈ సంబంధం మెగాస్టార్ చిరంజీవి తెచ్చారా? నాగబాబు స్వయంగా వెతికి పట్టుకున్నారా? పవన్ కళ్యాణ్ కుదర్చారా? అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు. నాగబాబు కుమార్తెకు పెళ్లిచేసేస్తానని గత ఏడాదే చెప్పారు. మంచి కుర్రాడు దొరికితే కుల, మత, ప్రాంత బేధం లేకుండా ముందుకెళ్తానన్నారు. నాటి నుంచి నిహారిక సినిమాలకు గుడ్ బై చెప్పాల్సి ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో మెగా డాటర్ ఇక సినిమాలకు దూరమైనట్లేనని తెలుస్తోంది. ఇక మెగా బ్రదర్స్ తండ్రి పోలీస్ కానిస్టేబుల్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఇంటికి అల్లుడిగా ఓ ఐజీ కుమారుడు వెళ్తున్నాడు.