అల్లు అరవింద్ ప్లాన్ “విజయ్ “వంతం అవుతుందా ?

తెలుగు సినిమా రంగంలో విజయ్ దేవరకొండ మంచి ఊపులో వున్నాడని చెప్పవచ్చు . ముఖ్యంగా యూత్ లో అతనికున్న క్రెజ్ ఇంతా అంతాకాదు . యంగ్ హీరోల్లో దూసుకుపుతున్నాడు . అతని సినిమాల బిజినెస్ కూడా గీత గోవిందం తరువాత బాగా పెరిగింది . విజయ్ దేవరకొండ 2011లోనే తెలుగు సినిమా రంగంలో ప్రవేశించాడు . దర్శకుడు రవిబాబు “నువ్విలా ” చిత్రంలో పరిచయం చేశాడు . ఆ తరువాత2012లో శేఖర్ కమ్ముల “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ” సినిమాలో అవకాశం ఇచ్చాడు . ఈ సినిమా విజయవంత అయినా విజయ్ దేవరకొండకు అవకాశాలు రాలేదు అప్పుడు అతను చాలా స్ట్రగుల్ అయ్యాడు . 2015లో నాగ్ అశ్విన్ ” ఎవడె సుబ్రహ్మణ్యం ?” సినిమాలో నానితో పాటు విజయ్ కూడా అవకాశం ఇచ్చాడు . ఈ సినిమాతో కొంత గుర్తింపు వచ్చింది . 2016లో తరుణ్ భాస్కర్ “పెళ్లిచూపులు ” అనే సినిమాలో మొదటిసారి హీరోగా తీసుకున్నాడు . ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ అయిపోయాడు . ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు . ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డును ప్రకటించింది . జాతీయ అవార్డుల్లో “పెళ్లిచూపులు ” చిత్రానికి ప్రాంతీయ సినిమాగా ఎంపికయ్యింది . విజయ్ జాతకం మారిపోయింది .

తెలుగు సినిమా ద్రుష్టి అంతా విజయ్ దేవరకొండ మీద పడింది . విజయ్ దేవరకొండ ఎవరు ? అని ఆరా తీయ సాగారు . అప్పుడే తెలంగాణ ఐటీ ,పురపాలక మంత్రి కేటీఆర్ విజయ్ దేవరకొండ తెలంగాణకు చెందిన వాడని ,ముఖ్యంగా తమవాడని తెలిసింది . అందుకే విజయ్ ను పరోక్షంగా ప్రోత్సహించడం మొదలు పెట్టాడు . 2017లో విజయ్ నటించిన “అర్జున్ రెడ్డి ” సూపర్ డూపర్ హిట్ అయ్యింది . విజయ్ కు స్టార్ స్టేటస్ వచ్చింది . నాగ్ అశ్విన్ విజయ్ కు తమ మహానటి సినిమాలో ఫోటో జర్నలిస్ట్ పాత్రలో అవకాశం ఇచ్చాడు . ఇక 2017లో వచ్చిన “అర్జున్ రెడ్డి ” సినిమా లో నటనకు విజయ్ కు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది . తనకు వచ్చిన ఫిలింఫేర్ అవార్డును వేలం వేయగా హైదరాబాద్ కు చెందిన శకుంతల అనే మహిళా 25 లక్షలకు పాడేసి తన స్వంతం చేసుకుంది . ఈ 25 లక్షల చెక్కు ను కేటీఆర్ ను కలసి ముఖ్య మంత్రి సహాయ నిధికి ఇచ్చాడు . అలా తనకు చేయూత నిచ్చిన కేటీఆర్ కు కృతజ్ఞత చూపించాడు . ఈ అవార్డు రావడానికి కేటీఆర్ కారణమని చెప్పుకుంటారు .

ఇక విజయ్ దేవరకొండకు అల్లు అరవింద్ “గీత గోవిందం “సినిమాలో తీసుకోడంతో అందరు ఆశ్చర్య పోయారు . ఈ సినిమా అరవింద్ కు అంతంత నమ్మకస్తుడు బన్నీ వ్యాస్ జీ ఏ 2 బేనర్ మీద తీయించాడు . తన ఇద్దరు కుమారులు అల్లు అర్జున్ , శిరీష్ ఉండగా విజయ్ దేవరకొండను ఎందుకు ఈ సినిమాలో హీరోగా తీసుకున్నట్టు ? చాలా మందికి అరవింద్ వ్యూహం అర్ధం కాలేదు . అలా అరవింద్ ఎందుకు విజయ్ ను ప్రోత్సహించడం వెనుక మాస్టర్ పాలనే ఉందని తరువాత తెలిసింది . విజయ్ ను హీరోగా ప్రమోట్ చేస్తే కేటీఆర్ సంతోషపడతారు . కేటీఆర్ దృష్టిలొ పడితే తాను అనుకున్నది సాధించవచ్చు . ఇందుకే అల్లు అరవింద్ విజయ్ దేవరకొండకు “గీత గోవిందం ” సినిమాలో అవకాశం ఇచ్చాడు . ఈ సినిమా వూహించనత హిట్ అయ్యింది . ఇప్పుడు అరవింద్ అనుకున్నది ఈజీగా అయిపోయే అవకాశం వుంది .

అరవింద్ వియ్యంకుడు శేఖర్ రెడ్డి అల్లు అర్జున్ మామ . శేఖర్ రెడ్డి టీఅర్ఎస్ పార్టీలో చురుకైన నాయకుడు. ప్రస్తుతం జూబిలీహిల్స్ శాఖకు అధ్యక్షుడుగా వున్నాడు . వచ్చే ఎన్నికల్లో శేఖర్ రెడ్డికి ఇబ్రహీం పట్టణం నుంచి టికెట్ ఇప్పించాలని అరవింద్ ఆలోచన . తమ వియ్యంకుడు శాసన సభ్యుడైతే తెలంగాణ రాష్ట్రంలో తమకు అండగా వుంటాడనేది అరవింద్ నమ్మకం . విజయ్ దేవరకొండ కోసం కేటీఆర్ ఏదైనా చెయ్యగలడు ? శేఖర్ రెడ్డి అంటే చంద్ర శేఖర్ రావుకు కూడా మంచి అభిప్రాయం వుంది . కాబట్టి గీత గోవిందం వెనుక ఇంత కథ వుంది . ఆమ్మో ….. అల్లు ప్లాన్ సూపర్ కదూ ?