Lucky Zodiac: లక్ష్మీ కటాక్షం ఉండే రాశులు ఇవే.. వీరికి ఎప్పటికీ డబ్బు కొరతే ఉండదట..!

సనాతన హిందూ సంప్రదాయంలో సకల సృష్టికి మూలాధారమైన శక్తిని అమ్మవారిగానే భావిస్తారు. లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతి రూపాల్లో ఆమెను ఆరాధిస్తారు. ధర్మశాస్త్రాల ప్రకారం అమ్మవారి దృష్టిలో అందరు సమానమే అయినప్పటికీ, కర్మఫలానుసారం కొంతమందికి ప్రత్యేక కటాక్షం లభిస్తుందని నమ్మకం. ముఖ్యంగా సంపదల దేవత లక్ష్మీదేవి అనుగ్రహం ఉండే కొన్ని రాశుల వారికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.

తులారాశి: శుక్రగ్రహం ఆధిపత్యంలో ఉండే తులారాశివారిపై లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి అదృష్టం వారివైపు మొగ్గుతుంది. వారు ఆనందం, సుఖసమృద్ధులతో జీవించే అవకాశం పొందుతారు.

వృశ్చికరాశి: కుజుడు అధిపతిగా ఉండే ఈ రాశి వారు కష్టపడి పని చేయడంలో ముందుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీరి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా విజయాన్ని సాధించడంలో ఆలస్యం ఉండదు.

కర్కాటకరాశి: చంద్రగ్రహం ఆధిపత్యం ఉన్న ఈ రాశి వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం. చంద్రుడు లక్ష్మీదేవి సహోదరుడే కావడంతో, ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు తలెత్తవు. ఎప్పటికీ డబ్బు కొరత లేకుండా సుఖసమృద్ధిగా జీవించే అవకాశం ఉంటుందని జ్యోతిష్యం చెబుతోంది.

వృషభరాశి:లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులలో వృషభరాశి ఒకటిగా పరిగణించబడుతుంది. వీరు కష్టపడి పనిచేసే వారు, నమ్మదగిన వారు. ఫలితంగా వారి జీవితంలో సంపద, విజయం సహజంగానే వస్తాయి.

సింహరాశి: సూర్యుడు అధిపతిగా ఉన్న ఈ రాశి వారిపట్ల కూడా లక్ష్మీదేవి దయ చూపుతుందని నమ్మకం. అయితే వీరు తమ కోపాన్ని అదుపులో ఉంచుకుంటేనే ఆర్థికంగా మరింత బలపడతారు. జాగ్రత్తగా ఉంటే సింహరాశివారు ఎప్పుడూ సంపదలో వెనుకబడరని గ్రంథాలు చెబుతున్నాయి.

(గమనిక: ధర్మశాస్త్రాలు చెబుతున్న ఈ విషయాలు విశ్వాసం, ఆచారం, వ్యక్తిగత నమ్మకాలపైనే ఆధారపడి ఉంటాయి. పూర్వకర్మ, పూజా విధానం, వ్యక్తిగత శ్రద్ధ అనుగుణంగా ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అయినా ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉండే అవకాశముందని శాస్త్రాలు గోషిస్తున్నాయి.