కిషన్ రెడ్డితో బండి సంజయ్‌కి చెక్ పెట్టేశారు.! వాట్ నెక్స్‌ట్.?

ఏడ్చారు.. నానా యాగీ చేశారు.! ప్చ్.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందర ఎంపీ బండి సంజయ్‌కి పార్టీ అధినాయకత్వం షాక్ ఇచ్చింది. ‘తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి బండి సంజయ్..’ అంటూ ఆయన సన్నిహితులు చాలా చాలా సంబరాలు ముందే చేసేసుకున్నారు.

కానీ, తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తప్పించింది బీజేపీ అధినాయకత్వం. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా వచ్చారు. బండి సంజయ్.. కొన్ని విషయాల్లో బీజేపీ యెదుగుదలకు స్పీడు బ్రేకర్లు వేసిన మాట వాస్తవం. జనసేనను కలుపుకుపోవడంలో ఆయన విఫలమయ్యారు.

కిషన్ రెడ్డికీ, పవన్ కళ్యాణ్‌కీ సన్నిహిత సంబంధాలున్నాయి. కిషన్ రెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం వుంది. పైగా, కేంద్ర మంత్రిగానూ పని చేస్తున్నారాయన. చంద్రబాబుని కూడా కలుపుకుపోగల సత్తా కిషన్ రెడ్డికి వుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకన్నట్లుగా భావించాలేమో.

ఇంతకీ, బండి సంజయ్ పరిస్థితేంటి.? కేంద్ర మంత్రి అవుతారా.? పార్టీలో ఆయనకు ముందు ముందు దక్కబోయే కీలక పదవులు ఏమైనా వున్నాయా.? ఇవన్నీ ముందు ముందు తేలాల్సిన అంశాలు.

తెలంగాణ బీజేపీ అధ్యక్ష మార్పుతో ఒక్కసారిగా బండి సంజయ్ అభిమానులు డీలాపడిపోయారు. ‘ఇక తెలంగాణలో బీజేపీ యెదుగుదల కష్టమే..’ అనేస్తున్నారు. ‘పాదయాత్ర’ చేసినా, బండి సంజయ్‌ని బీజేపీ అధినాయకత్వం ఎందుకు నమ్మలేదో ఏమో.!