కావల్సినంత బోల్డ్‌ కంటెంట్ ఉంది…ఎంజాయ్

‘ఆర్ ఎక్స్ 100’ తరవాత యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న రెండవ చిత్రం హిప్పీ. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు టి ఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో కార్తికేయ సరసన దిగణన సూర్యవంన్షి , జజ్బా సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నివాస్ ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది. . జూన్ 7న సినిమాను విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేస్తున్న చిత్రయూనిట్‌ ట్రైలర్ ని రిలీజ్ చేసింది.

Hippi Movie Trailer | Karthikeya | Digangana Suryavanshi | Jazba Singh | TN Krishna | V Creations

ఇక ఈ ట్రైలర్‌లో ఆర్ ఎక్స్ 100 ద్వారా కార్తికేయకు అభిమానులుగా మారిన వాళ్లను నిరాశపరచకుండా కావల్సినంత బోల్డ్‌ కంటెంట్ ఉంది. అంతే కాకుండా ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ తో ఖుష్ చేసారు. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో జేడీ చక్రవర్తితో చెప్పే డైలాగ్‌లు బాగున్నాయి.

హీరో కార్తికేయ మాట్లాడుతూ – ‘మా హిప్పీ జూన్ 7న విడుద‌ల కానుంది. షూటింగ్ చాలా బాగా జ‌రిగింది. ఔట్‌పుట్ అనుకున్నదానికన్నా బాగా వ‌చ్చింది. టీమ్ అంద‌రం హ్యాపీగా ఉన్నాం. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైన‌ర్ ఇది. ఇందులో ఓ వైపు రియలిస్టిక్‌ స్టోరి ఉంటుంది. మ‌రో వైపు ఫుల్‌లెంగ్త్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. అన్ని కమర్షియల్‌ అంశాలను పర్‌ఫెక్ట్‌గా బ్లెండ్‌ చేశారు ద‌ర్శకుడు.

కబాలి వంటి బ్లాక్ బ‌స్టర్ చిత్రాలను నిర్మించిన కలైపులి ఎస్‌. థానుగారి సంస్థలో హిప్పీ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయ‌న ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పెద్ద బ‌డ్జెట్ చిత్రంలా చేశారు. జె.డి. చ‌క్రవ‌ర్తిగారిది చాలా చాలా కీ రోల్‌. ఆయ‌న క‌థ విన‌గానే ఒప్పుకోవ‌డంతో హ్యాపీగా ఫీల‌య్యా. ఆయన నటనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. హీరోయిన్ దిగంగన చాలా అద్భుతమైన నటి. ఈ సినిమాలో తనది మంచి క్యారెక్టర్‌. అంద‌రినీ మెప్పిస్తుంది. సంగీతం కూడా చాలా బాగుంది. ఆర్‌.డి. రాజశేఖర్‌గారి ఫొటోగ్రఫీ సినిమాకు మంచి ఎస్సెట్‌గా నిలుస్తుంది’ అన్నారు.

నటుడు జె.డి. చక్రవర్తి మాట్లాడుతూ – ‘క‌థ విన‌గానే న‌చ్చింది. నా పాత్రకున్న ఇంపార్టెన్స్ అర్థమై వెంట‌నే ఓకే చెప్పేశాను. కార్తికేయ‌ను ఆర్‌.ఎక్స్ 100లో చూశా. రొమాన్స్‌, ఫైట్స్‌, డ్యాన్స్‌ చాలా బాగా చేస్తున్నాడు. తప్పకుండా మంచి హీరోగా ఎదుగుతాడు. అతనికి కెరీర్ బిగినింగ్‌లోనే హిప్పీ లాంటి క‌థ కుద‌ర‌డం గ్రేట్‌. మంచి మ‌న‌సున్న క‌లైపులి థానుగారి బ్యాన‌ర్‌లో ఈ సినిమా చేస్తున్నందుకు నాక్కూడా చాలా ఆనందంగా ఉంది’ అన్నారు.