ఆ హీరోతో పాయల్ మళ్లీనా.?

‘ఆర్ ఎక్స్ 100’ సినిమా కాంబో మళ్లీ రిపీట్ కానుందట. యంగ్ హీరో కార్తికేయ, అందాల భామ పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాతో హీరో, హీరోయిన్లుగా పరిచయమైన సంగతి తెలిసిందే.

సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. అటు కార్తికేయకీ, ఇటు పాయల్ రాజ్‌పుత్‌కీ కూడా మంచి పేరొచ్చింది ఈ సినిమాతో.

ఆ తర్వాత పాయల్ రాజ్‌పుత్‌కి తెగ క్రేజ్ వచ్చేసింది కూడా. ఆ క్రేజ్‌తోనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ సైతం పాయల్‌‌కి ఆఫర్ చేశారు కొందరు. అయితే బోల్డ్ కంటెంట్ ఎక్కువగా కావాలంటున్నారన్న కారణంగా ఆయా ప్రాజెక్టులు వదిలేసుకోవల్సి వచ్చింది పాయల్ రాజ్‌పుత్.

ఆ తర్వాత స్టార్ హీరోలైన వెంకటేష్, రవితేజ వంటి అగ్ర హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది పాయల్ రాజ్ ‌పుత్. అయితే, స్టార్‌డమ్ అయితే దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం పాయల్ కెరీర్ ఏమంత జోష్‌ఫుల్‌గా అయితే లేదు.

దాంతో, తన మొదటి సినిమా హీరో అయిన కార్తికేయతో ఓ సినిమా చేయాలనుకుంటోందట. అందుకు కారణం ఓ యంగ్ డైరెక్టర్ అనీ తెలుస్తోంది. ఓ యంగ్ డైరెక్టర్ ‘ఆర్ఎక్స్ 100’ తరహాలో ఓ న్యూ కాన్సెప్ట్ తీసుకొచ్చాడట.

పాయల్ రాజ్‌పుత్ అయితేనే ఆ సినిమాకి న్యాయం చేస్తుందని భావిస్తున్నాడట. హీరోగా కార్తికేయను అనుకుంటున్నాడట. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత ఇటీవలే ‘బెదురులంక 2012’ సినిమాతో ఊపిరి పీల్చుకున్నాడు కార్తికేయ.

ఇదే ఊపులో మరో రెండు ప్రాజెక్టుల వరకూ ఓకే చేశాడనీ తెలుస్తోంది. దాంతో పాటూ, ఈ నయా ప్రాజెక్ట్ సైతం టేకప్ చేసే అవకాశాలున్నాయని సమాచారం చూడాలి మరి.