Kantara Movie Review
నటీనటులు: రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్, ఉగ్రం రవి, ప్రకాష్ తుమినాడ్
దర్శకత్వం : రిషబ్ శెట్టి
తమిళ్ సినిమాలు, తమిళ్ నటులు తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయం. కానీ కన్నడ సినిమాలు మన దగ్గర అంత తెలియవు. అప్పుడెప్పుడో సాయి కుమార్ ‘పోలీస్ స్టోరీ’ ఆ తర్వాత కొన్నాళ్ళు ఉపేంద్ర, థ్రిల్లర్ లాంటి మంజు సినిమాలు కొన్నాళ్ళు అలరించాయి.
కానీ ఆ తరువాత కన్నడ సినిమాల గురించి మనకు అంతగా తెలియదు. ఈ మధ్య ‘కెజిఫ్’ హిట్ తర్వాత కన్నడ సినిమాలు కూడా మళ్ళీ తెలుగు లో రిలీజ్ అవుతున్నాయి. ‘కెజిఫ్’ ప్రొడ్యూస్ చేసిన సంస్థ నుండి తాజాగా ‘కాంతార’ అనే సినిమాను తెలుగు లో అల్లు అరవింద్ విడుదల చేసాడు. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.
కథ: Kantara Movie Review
ఈ మూవీ మొత్తం ఒక ఊరు, దాని చుట్టూ ఉన్న భూముల చుట్టూ తిరుగుతుంది. అడవిలో నివసించే ఆ ఊరి పెద్ద (అచ్యుత్ కుమార్) ఊరికి ఏ సమస్య వచ్చినా సాయంగా ఉంటాడు. ఆయనకు సహాయంగా శివ(రిషబ్ శెట్టి) చేదోడువాడోడుగా ఉంటాడు. శివ మొదటి నుంచి అడవిలోకి వేటకు వెళ్తుంటాడు. ఫారెస్ట్ ఆఫీసర్ గా వచ్చిన మురళీ(కిశోర్) శివ ని అడవిలో వేటకు వెళ్లకుండా చెయ్యడానికి ప్రయతినిస్తూ ఉంటాడు. అడవిలోకి వెళ్లడానికి వీల్లేదని, ఊరికి హద్దులు పెట్టాలని ఆర్డర్ వేస్తాడు. అలాగే శివ లవర్ లీల(సప్తమి గౌడ) ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లోనే పని చేస్తూ భూమిని సర్వే చేయడంలో ఫారెస్ట్ ఆఫీసర్‌కు సాయం చేస్తుంది. కొన్ని అనుకోని సంఘటన వల్ల శివ జైలుకు వెళ్లగా అతని చిన్నప్పటి ఫ్రెండ్ హత్యకు గురవుతాడు. తన స్నేహితుడిని హత్య చేసింది మురళి అని అనుకుంటాడు శివ. ఈ విషయాన్ని ఊరి పెద్దకు కూడా చెబుతాడు. అయితే ఆయన ఎవరివైపు నిలబడుతాడు, శివ తన ఊరి భూమిని కాపాడుకున్నాడా లేదా అన్నదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్..
కథ, కథనం
నటీనటుల నటన
ట్విస్టులు
మైనస్ పాయింట్స్..
ఎడిటింగ్ లోపం..
తక్కువగా ఆకట్టుకునే మ్యూజిక్
తీర్పు – Kantara Movie Review
ఓవరాల్ గా ఈ సినిమా చూస్తుంటే ఈ స్టోరీ ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి సీన్ ఎమోషనల్ గా ఉండడంతో ప్రేక్షకుల చూపును అలాగే కట్టి పడేస్తుంది. అడవి మనుషుల్లో ఉండే అమాయకత్వం, సమజమైన ప్రేమ ఇందులో కనిపిస్తాయి. మొత్తానికి ఈ సినిమా తెలుగు లో హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.