కేసీఆర్‌ కుమార్తెకి ‘డబుల్‌’ ట్రబుల్‌.! నిజం ఇదీ.!

kalvakuntla kavitha have The right to vote two places

ఆమె, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కుమార్తె. అలాగని.. ఆమె నేరుగా రాజకీయాల్లోకి వచ్చేయలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి తమ సొంత పార్టీనే అయినా, తెలంగాణ జాగృతిని స్థాపించి, తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు.. మహిళా లోకం మన్ననల్ని అందుకున్నారు కవిత. ‘కుటుంబ పార్టీ’ అనే విమర్శల నేపథ్యంలో, కవిత.. కొంతకాలం టీఆర్‌ఎస్‌కి దూరంగానే వున్నారు.

kalvakuntla kavitha have The right to vote two places
kalvakuntla kavitha have The right to vote two places

తెలంగాణ రాష్ట్రం ఖాయమయ్యాక, టీఆర్‌ఎస్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచారు కూడా. అయితే, రెండో సారి మాత్రం ఆమెకు చుక్కెదురయ్యింది. కొంతకాలం వేచి చూసి, ఇటీవలే ఆమె ఎమ్మెల్సీగా ఛాన్స్‌ దక్కించుకున్నారు. రేపో మాపో ఆమెకు మంత్రి పదవి రావొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతలోనే పెద్ద కుదుపు. కవితకి రెండు చోట్ల ఓటు హక్కు వుందనీ, ఆమెపై అనర్హత వేటు వేయాల్సిందేనని బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. అసలేంటి కథ.?

నిజామాబాద్‌లోనూ, హైద్రాబాద్‌లోనూ.!

నిజామాబాద్‌ జిల్లాలో కవితకు ఓటు హక్కు వుందట. మొన్నీమధ్యనే ఆమె అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు కూడా. తాజాగా, గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల నేపథ్యంలో హైద్రాబాద్‌లో కూడా ఆమె ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే వివాదానికి కారణం. అయితే, తన ఓటు హక్కు బదలాయింపు విషయమై పెట్టుకున్న అభ్యర్థనను అధికారులు మన్నించారనీ, పాత ఓటు పోయి, కొత్త ఓటు వచ్చిందనీ కవిత అంటున్నారు. అధికారులు కూడా ఇదే మాట చెబుతున్నారు. అయితే, బీజేపీ నేతలు మాత్రం, ఇదంతా హంబక్‌ అంటున్నారు. కవితకి అధికారులు ప్రత్యేక వెసులుబాటు కల్పించారా.? రెండు చోట్ల ఓటు హక్కు కలిగి వుండడం నైతికత కాదు, ఎన్నికల కమిషన్‌ దృష్టిలోనూ అది నేరమేనని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

కవితను అలా ఓడించిన బీజేపీ, ఇలా బుక్‌ చేస్తోందా.?

గత లోక్‌సభ ఎన్నికల్లో కవిత ఓడింది బీజేపీ చేతుల్లోనే. ఆమె ఊహించని ఓటమి అది. కవితను ఓడించేందుకు బీజేపీ అప్పట్లో సర్వశక్తులూ ఒడ్డింది. కానీ, ఈసారి బీజేపీ వాదనలో ‘పస’ తక్కువగా కన్పిస్తోంది. అధికారులే స్పష్టతనిచ్చాక, రెండు చోట్ల ఓటుపై వివాదమేముంది.? అయినాగానీ, ప్రజల దృష్టిలో మాత్రం కవిత పలచనైపోయారు. సాధారణ ప్రజానీకం తమ ఓటు హక్కుని బదలాయించుకోవాలంటే నానా తంటాలూ పడాలి. అలాంటిది, కవిత ఓటుని అంత తేలిగ్గా ఎలా ఇంకో చోటకు మార్చుతారు.? అన్నది సాధారణ ప్రజానీకంలోనూ విన్పిస్తోన్న విమర్శ. ఏమో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందోగానీ, కవిత మాత్రం ‘డబుల్‌ ట్రబుల్‌’ని ఎదుర్కొంటున్నారు.

మంత్రి పదవి దక్కుతుందా.? లేదా.?

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలొచ్చిన వెంటనే, కవితకు కేసీఆర్‌ మంత్రి వర్గంలో చోటు దక్కనుందనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. కవిత కూడా తన సన్నిహితుల వద్ద ఇదే మాట చెబుతున్నారట. గత గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో తన కుమారుడు కేటీఆర్‌కి ప్రమోషన్‌ ఇచ్చారు కేసీఆర్‌. ఈసారి గ్రేటర్‌ ఎన్నికల్లో కేటీఆర్‌తోపాటు కేటీఆర్‌ కూడా గట్టిగానే ప్రచారం చేశారు. సో, టీఆర్‌ఎస్‌ గనుక ఇంకోసారి అధికార పీఠం గ్రేటర్‌లో దక్కించుకుంటే.. కవితకు మంత్రి పదవి దక్కడం దాదాపు ఖాయమే.