పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారు ఎక్కడ ?

జానారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు.చాలా ఫేమస్ అండ్ పొలైట్ పొలిటీషియన్.
ఉమ్మడి రాష్ట్రంలో హోం మంత్రితో పాటు ఎన్నో మంత్రి పదవులు ఆయన్ని వరించాయి. ఒకప్పుడు సీఎం రేసులో కూడా నిలిచారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత పెద్దలు గౌరవనీయులు అంటూ సీఎం కేసీఆర్ చేత నిండు సభలో పొడిగించుకున్న అరుదైన నేత జానారెడ్డి. కాని అదంతా గతం. అప్పట్లో కాంగ్రెస్ అంతో ఇంతో బలంగా ఉంది కాబట్టి ఆమాత్రం మర్యాదలు దక్కాయి. కాని ఇప్పుడు కేసీఆర్ ప్రభంజనం నడుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ కు తిరుగులేకుండా పోయింది. గులాబీ పార్టీ తాకిడికి పెద్ద పెద్ద నేతలే చతికల పడుతున్నారు. ఇలా కేసీఆర్ పొలిటికల్ పంచ్ లతో జానారెడ్డి రాజకీయ జీవితం అయోమయంలో పడిపోయింది.

టీచర్ గా ప్రస్తానం ప్రారంభించిన జనారెడ్డి ఆతర్వాత రాజకీయాల్లోకి వచ్చి నాగార్జున్ సాగర్ నుంచి ఏకంగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాని 2019లో టీఆర్ఎస్ నేత నోముల నర్సింహులు చేతిలో ఓడిపోయారు. ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత వచ్చిన స్థానిక ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలతో పాటు చివరకు సహకార సంఘాల ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగింది. దీంతో 40 ఏళ్లుగా తన వెంటే ఉన్న క్యాడర్ క్రమక్రమంగా దూరమైపోయింది. తన వాళ్లను కూడా గెలిపించుకోలేకపోయారు ఈ మాజీ హోంమంత్రి.

కేసీఆర్ ప్రభజనంలో చోటు చేసుకున్న ఈ వరుస ఓటములతో జానారెడ్డి పొలిటికల్ కెరీర్ డైలమాలో పడింది. సకాలంలో వారసుడిని రాజకీయాల్లోకి తీసుకురాలేకపోవడం … దీనికి తోడు వయోభారం తోవడంతో ఆయన ఫ్యామిలీ పొలిటికల్ కెరీర్ డేంజర్లో పడిపోయింది. కొడుకు రఘువీర్ రెడ్డి కి 2014లో మిర్యాలగూడ టిక్కెట్టు ఇప్పించుకోలకపోవడంతో ఆయన పొలిటికల్ కేరీర్ స్టాట్ కాలేకపోయింది.

అటు అధికారంలో లేకపోవడం… ఇటు నియోజకవర్గంలో బలహీనపడడం … దీనికి తోడు అటు వారసత్వాన్ని సకాలంలో రాజకీయాక రంగ ప్రవేశం చేయించలేకపోవడం… తనకు వయసు మీద పడడం…. ఇలా అన్నీ కల గలిసి ఈ మాజీ హోం మంత్రి కన్న కళలను నిర్వీర్యం చేశాయి.

నల్గొండ జిల్లాకే చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు ఉత్తం కుమార్ రెడ్డి టీఆర్ఎస్ పై పోరు బాటు ఎగరేసి అంతో ఇంతో ఇమేజ్ కాపాడుకుంటున్నారు. కాని మర్యాదస్తుడిగా ముద్రపడ్డ జానారెడ్డికి ఇది చేతకాక చతికిలపడిపోతున్నారు. చూడాలి మరి కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా తన కుమారుడు రఘువీర్ రెడ్డికి టిక్కెట్టు ఇప్పించుకొని ఎన్నికల బరిలో గెలిపిస్తాడో లేక నాయని నర్సింహారెడ్డి లా వారసుడికి అవకాశం కల్పించకుండానే రాజీకయ ప్రస్తానాన్ని ముగిస్తాడో వేచి చూడాలి.