దుబ్బాకలో రచ్చ రచ్చ… అయినా పత్తా లేని బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్

ఆయన జాతీయ పార్టీకి తెలంగాణలో ఇంఛార్జ్. కాని ఆయన గురించి తమకే తెలియదని ఆపార్టీ నేతలే జోకులు వేసుకుంటున్నాయి. దుబ్బాక ఉపఎన్నికలు హాట్ హాట్ గా సాగుతున్న తరుణంలో కూడా ఆయన జాడ లేకపోవడంతో అసలు ఆయన ఉన్నట్టా, లేన్నట్టా అనే టాక్ నడుస్తోంది.

దుబ్బాక ఉపఎన్నికల్లో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండూ అధికార పార్టీని గట్టిగా ఢీ కొంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే దుబ్బాకలో నెలకొన్న త్రిముఖ పోటీ కారణంగా అగ్గి రాజుకుంటోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు అంతా దుబ్బాక కేంద్రంగా అగ్గి రాజేస్తున్నారు. పొలిటికల్ హీట్ పుట్టిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. అటు అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా అన్ని అస్త్రశస్త్రాలు సంధిస్తోంది. కమళం పార్టీకి కళ్లెం వేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని అధికారాలను పూర్తి స్థాయిలో ఉపయోగిస్తోంది. ఇక అభ్యర్థి రఘునంద్ రావు అయితే ఏకంగా పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. అధికార పార్టీ పోలీస్ జులూం ప్రదర్శిస్తోందని బీజేపీ ఆరోపిస్తే…డబ్బులు పంచి ఓట్లు కొనుక్కుంటున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. సోదాలు, అరెస్టులు కామన్ అయిపోయాయి. దీంతో ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నే నేరుగా రంగంలోకి దిగార్సి వచ్చింది. ఫోన్ చేసి మరీ దుబ్బాక వ్యవహారాలు తెలుసుకుంటున్నారు. హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అయితే జరిగిన పరిణామాలపై తనకు రిపోర్టు ఇవ్వాలని ఏకంగా డీజీపీనే ఆదేశించారు.

మరోవైపు కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్ పీసీసీ నేతలను పరుగులు పెట్టిస్తున్నారు. ఉత్తం, కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి లాంటి సీనియర్లకు తలా ఓ మండలాన్ని కేటాయించి వారితో ఎన్నికల ప్రచారం చేయిస్తున్నారు. ఎన్నికల ఖర్చు కోసం పార్టీ అభ్యర్థిని ఇబ్బంది పెట్టొద్దని కూడా హుకూం జారీ చేశారు. అవకాశం చిక్కినప్పుడల్లా టీఆర్ఎస్ పార్టీ అధినాకత్వంపై విరుచుకుపడుతున్నారు. దీంతో కిందటి ఉపఎన్నికల్లో నిస్తేజంలా కనిపించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి జోరు మీద కనిపిస్తోంది. వర్గపోరుతో సతమతం అవుతున్న కాంగ్రెస్ పార్టీనే ఆయన పరుగులు పెట్టిస్తుంటే… ఎలాంటి ఇబ్బంది లేని బీజేపీని నడిపించేందుకు కూడా రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ సుముఖత చూపించడం లేదు. దీంతో అసలు ఆయన ఉన్నారా లేరా అనే టాక్ నడుస్తోంది.

why all parties fighting to win in dubbaka?
why all parties fighting to win in dubbaka?

త్వరలో రెండు పట్టభద్రల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల వేళ కూడా…ఆయన జాడ మాత్రం దొరకడం లేదు. మరోవైపు కనీసం తెలంగాణలో బీజేపీ పార్టీ స్థితిగతుల గురించి ఆయన ఎన్నడూ గట్టిగా సమీక్ష చేసిన సందర్భాలు కూడా లేవంటా. అలాగే ప్రజా సమస్యలపై రాష్ట్ర నేతలను పరుగులు పెట్టించిన ఉదంతాలు కూడా లేవని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఇటీవలే రాష్ట్ర పార్టీ పదాధికారుల సమావేశం జరిగితే దానికి కూడా ఆ డమ్మా కొట్టారంటా. ఇదండీ పరిస్థితి . ఒక వేళ కృష్ణ దాసు పొరపాటును పార్టీ కార్యాలయానికి వస్తే కనీసం ఆయన్ని నాయకులు కూడా గుర్తుపట్టలేరని బీజేపీ వర్గాలే జోకులు వేసుకుంటున్నాయి.