‘గుంటూరు కారం’ పెయిడ్ టాక్.! ప్రమాదకరమే సుమీ.!

‘గుంటూరు కారం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సహజంగానే మహేష్‌బాబు సినిమాలంటే, పెయిడ్ టాక్ విపరీతంగా కనిపిస్తుంటుంది. పైగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా కావడంతో, అతని అభిమానులూ పాజిటివ్ టాక్ బలంగా ప్రచారంలోకి తీసుకొచ్చారు.

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందడి నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇటు వైఎస్ జగన్ అభిమానులు.. ఇద్దరూ మహేష్‌బాబుకి మ్యూచువల్ అభిమానులుగా విడివిడిగా మారిపోయారు.

అభిమానులు తెచ్చే పాజిటివ్ టాక్ ఓ లెక్క.! పెయిడ్ టాక్ ఇంకో పక్క.! సెన్సార్ టాక్ పేరుతో, విపరీతమైన పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది. ‘స్టోరీ ఇదే’ అంటూ కొన్ని ఫేక్ స్టోరీలూ ప్రచారంలోకి వచ్చాయి.

ఇవన్నీ ఓవర్సీస్‌లో ‘గుంటూరు కారం’ సినిమాకి ఘనమైన ఓపెనింగ్స్ తీసుకొస్తాయనడం నిస్సందేహం. సంక్రాంతి సీజన్ కదా.. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు వసూళ్ళ మోత మోగిపోవడం ఖాయం.

కానీ, అసలు టాక్ తేడా వస్తేనో.? దానికీ, తెరవెనుకాల ‘పెయిడ్ వ్యవహారాలు’ గట్టిగానే నడుస్తున్నాయి. ‘సర్కారు వారి పాట’ సినిమాకి ఎంత నెగెటివిటీ వచ్చిందో చూశాం. ఈసారి అంతకు మించి రాబోతోందిట.! కానీ, అది చేస్తున్నదెవరు.?